పవన్ కల్యాణ్ పేరు చెప్పి అలాంటి మోసం.. ముందో మాట వెనుకో మాట.. చిరంజీవి కామెంట్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి ముస్తాబైంది. ఆగస్టు 11వ తేదీన తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో అట్టహాసంగా ఈ మూవీ రిలీజ్ కాబోతున్నది. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే..
భోళా శంకర్ చిత్రంలో కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్‌లో శ్రీముఖితో సీన్లు ఉంటాయనేది స్పష్టమైంది. ట్రైలర్‌లో చిరంజీవిని చూస్తూ భోళాజీ అంటూ చిలిపిగా పిలిచిన సీన్ వైరల్ అయింది. దాంతో శ్రీముఖి, చిరంజీవి మధ్య సీన్లలో కెమిస్ట్రీ బాగా పండి ఉంటుందనే ఫీలింగ్‌తో ఫ్యాన్స్ ఉన్నారు.

ఇక భోళా శంకర్ సినిమాలో చిరంజీవి రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని యూనిట్ వర్గాలు చెప్పుకొంటున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ అభిమానిగా చిరంజీవి కాసేపు కనిపించబోతున్నారు. అలాంటి సీన్లు అభిమానులకు కన్నులు పంటగా ఉంటుంది. ఆ సీన్లలో శ్రీముఖితో చిరంజీవి చేసే మ్యాజిక్ ఆకట్టుకొనేలా ఉంటుందని చెప్పుకొంటున్నారు. అదే విషయాన్ని చిరంజీవి చెప్పే ప్రయత్నం చేశారు.

శ్రీముఖి చాలా టాలెంటెడ్ యాక్టర్. నేనంటే ఆమెకు చాలా పిచ్చి. నా తర్వాత పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. నేను కనపడితే నా పేరు చెబుతుంది. నేను కనపడకపోతే పవన్ కల్యాణ్ పేరు చెబుతుంది. అలా ముందో మాట వెనుకో మాట మాట్లాడినా నా కుటుంబంలో ఓ మెంబర్‌గా అమెను నేను చూస్తాను అని చిరంజీవి అన్నారు.

భోళా శంకర్ సినిమాలో శ్రీముఖితో నాకు మధ్య మంచి ఎపిసోడ్ ఉంటుంది. ఆమెను ఎందుకు దగ్గరకు లాగేసుకొన్నాను అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. మా మధ్య కొన్ని సీన్లు జరిగినయి. ఆ సీన్లలో మీరు నన్ను చూడరు. కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే చూస్తారు అంటూ తన మెడపై చేయి పెట్టి పవర్ స్టార్ మేనరిజాన్ని చిరంజీవి చూపించారు. మీ అందరికి కన్నుల పండువగా ఉంటుంది అని చెప్పారు.
భోళా శంకర్ చిత్రానికి ఓవర్సీస్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన కనిపిస్తున్నది. విడుదలయ్యే ప్రతీ చోట దాదాపు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్లు కురిపిస్తున్నాయి. ఈ సినిమా అమెరికాలో ఆగస్టు 10వ తేదీ రాత్రి నుంచి ప్రీమియర్లు మొదలవుతాయి.


Click it and Unblock the Notifications











