రాజమౌళి, మహేష్ సినిమాలో మరో సూపర్ స్టార్.. మల్టీ స్టారర్‌ను మించి..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంపై రోజు రోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా, దర్శకుడు దేవా కట్టా మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా ఎంఎం కీరవాణి సంగీతం, పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఒడిశా, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్ వేగంగా జరుపుకొంటున్నది. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక వ్యవహారం ఇండియన్ ఇండస్ట్రీలోనే సెన్సేషనల్‌గా మారింది. తాజాగా ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ చేరడం ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో చేరిన స్టార్ హీరో వివరాల్లోకి వెళితే..
SSMB 29 అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనస్, జాన్ అబ్రహం, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ కుమార్ భగత్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన షూటింగులో జాన్ అబ్రహం, ప్రియాంకపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఒడిశాలో జరిగిన షూట్‌లో ప్రియాంక, పృథ్వీరాజ్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా షూట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

మహేష్ బాబుతో రూపొందిస్తున్న సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను రపించారు. ఇటీవల మహేష్‌పై కొన్ని భారీ యాక్షన్ సీన్లను తీశారు. ఈ ఫైట్స్‌లో తొలిసారి మహేష్ షర్ట్ లేకుండా బేర్ బాడీతో కనిపించారు. సిక్స్ ప్యాక్‌తో ఆయన కనిపిస్తారు. ఈ ఫైట్ సీన్ కోసం సుమారుగా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో పిలిపించారు. ఈ ఫైట్‌ను తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రీతిలో షూట్ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ సినిమాలో స్టార్లు ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని కూడా ఎక్కడా వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఈ సినిమా అప్ డేట్స్ గురించి మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్నపాటి వార్తను కూడా లీక్ చేసినా సంతోషపడిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తమిళ స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఇప్పటికే బాలీవుడ్ నుంచి ప్రియాంక, జాన్ అబ్రహం, మలయాళం నుంచి పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారనే విషయం మీడియాకు తెలిసిపోయింది. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలోను, సినీ వర్గాల్లోను ప్రచారం జరుగుతున్నది. అదే నిజమైతే ఈ సినిమాకు ఆయన స్పెషల్ఎట్రాక్షన్‌గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
మహేష్ బాబు కెరీర్‌లో 29వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 1000 కోట్ల రూపాయలతో నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కనివీని రీతిలో తెరకెక్కిస్తూ.. ఈ మూవీని గ్లోబల్ సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను పాలో అవుతుండండి.


Click it and Unblock the Notifications











