"పుష్ప 2"కి సుక్కు దర్శకత్వం వీక్ గా ఉందా? ఈ విషయంలో ఒపీనియన్ మార్చుకోవాల్సిందే
ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లతో బాక్సాఫీన్ ని షేక్ చేస్తున్న బిగ్గెస్ట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా "పుష్ప 2" అనే చెప్పాలి. కాగా ఈ చిత్రం అనుకున్న దాని కంటే భారీ వసూళ్లు మొదటి వారాంతం లోనే అందుకుంది. అయితే ఈ చిత్రానికి నిజానికి చెప్పాలంటే మరీ సూపర్ హిట్ టాక్ ఇప్పటికీ చాలా మంది ఆడియెన్స్ లో లేదు.
ఈ టాక్ తో కూడా పుష్ప 2 సెన్సేషనల్ వసూళ్లు నమోదు చేయడంలో ఎఫెక్ట్ చెయ్యలేకపోయింది. ఈ సినిమాలో మెయిన్ గా సుకుమార్ దర్శకత్వంపై కూడా చాలా కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా సినిమాలో అసలు కథే లేదు అంటూ సుకుమార్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సుకుమార్ అక్కడికక్కడే సీన్స్ మారుస్తూ ఉంటాడు అని డైలాగ్స్ విషయంలోనూ శ్రద్ధ పెట్టలేదంటూ విమర్శలు వస్తున్నాయి.

కానీ ఇపుడు కొన్ని విషయాల్లో మాత్రం సుకుమార్ చేసిన డిఫరెంట్ టేకింగ్ మాత్రం డెఫినెట్ గా ఆ కొందరి ఒపీనియన్ ని మార్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాలి. కాగా ఒక సీక్వెల్ సినిమా అన్నాక ఒక రకమైన ఉత్సుకత తప్పకుండా ఉంటుంది. పార్ట్ 2 ఇంకా రిలీజ్ కాక ముందే చాలా థియరీలు వినిపిస్తూ ఉంటాయి. అలానే ఇండియాస్ బిగ్గెస్ట్ సీక్వెల్ చిత్రాలు బాహుబలి 2 కి కానీ KGF 2 లాంటి సినిమాలకి ఇలాంటివి చాలానే వచ్చాయి.
అలానే పుష్ప 2 కి కూడా చాలా కామెంట్స్ వినిపించాయి. పార్ట్ 2లో పుష్ప ని దెబ్బ కొట్టేది తన ఫ్రెండ్ కేశవ పాత్రే అని అలాగే శ్రీవల్లిని రౌడీలు చంపేస్తారు అంటూ పుష్ప 2 ఇంకా షూటింగ్ స్టేజిలో ఉన్నపుడే చాలా కామెంట్స్ వినిపించాయి. ప్రేక్షకుడు ఆశించే విధంగా కాకుండా మరో వెర్షన్ లో చూపించి సినిమాని రక్తి కట్టించడం అనేది మామూలు విషయం కాదు. అక్కడే ఒక దర్శకుడి గొప్పతనం కనిపిస్తుంది .

కాగా సరిగ్గా ఇక్కడే సుకుమార్ తన బ్రిలియెన్స్ చూపించాడు. పుష్పకి నమ్మక ద్రోహం, రష్మిక రోల్ ని చంపెయ్యడం లాంటివి లేకుండానే ఓవరాల్ మాస్ ఆడియెన్స్ ని మెప్పించడం చిన్న విషయం కాదు. మరీ ఇలాంటి రెగ్యులర్ సీన్స్ లేకుండా సినిమా తీసి మెప్పించడాన్ని బట్టి కంప్లీట్ గా సుకుమార్ కే క్రెడిట్ ఇవ్వాలి.
ఇక పుష్ప 2 ఆల్రెడీ 700 కోట్లకి పైగా వసూళ్లు దాటి 1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా ఖైదీ, సర్దార్ .. రీసెంట్ గా "క" లాంటి సినిమాలకి సంగీతం ఇచ్చిన సామ్ సి ఎస్ కూడా పుష్ప2కి మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మించింది.


Click it and Unblock the Notifications











