ఇద్దరు పిల్లల తండ్రితో సూపర్‌స్టార్ సోదరి అఫైర్.. గృహనిర్బంధ వివాదంలో కొత్త కొణం
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ ప్రేమ వ్యవహారం మీడియాలో వివాదంగా మారింది. తన ప్రేమను నిరాకరించి, తనను గృహ నిర్బంధం చేశారంటూ తన కుటుంబంపై సునైనా ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. రుహైల్ అమీన్ అనే జర్నలిస్టుతో కొద్దికాలంగా అఫైర్‌లో సునైనా ఉంది. అయితే తన కూతురు ప్రేమించింది ఓ టెర్రరిస్టును అని రోషన్ కుటుంబం కామెంట్ చేయడం మరింత రచ్చగా మారింది.
ఈ వివాదం నేపథ్యంలో బాలీవుడ్ పత్రికలు రుహైల్ అమీన్ గురించి ఆసక్తికరమైన కథనాలను ప్రచురించాయి. రుహైల్ ఇప్పటికే వివాహితుడు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందుకే హృతిక్, రాకేష్ రోషన్ దంపతులు ఆమె ప్రేమను నిరాకరిస్తున్నారు. ఇప్పటికే సునైనా గత వైవాహిక జీవితంలో ఎన్నో తప్పులు చేసింది. మళ్లీ మరోసారి సునైనాకు అలాంటి చేదు అనుభవం ఎదురుకాకుండా ఉండేదుకే తాము జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని కథనాల్లో పేర్కొన్నాయి.

తనపై వచ్చిన కథనాలపై రుహైల్ అమీన్ స్పందించారు. కొన్ని కథనాలు నా దృష్టికి వచ్చాయి. బాలీవుడ్ పత్రికలు ఏదైనా రాసే స్వేచ్ఛ ఉంది. నన్ను టెర్రరిస్టు అని పేర్కొనడం దారుణం. నా మతం కారణంగానే ఇలాంటి ముద్ర వేస్తున్నారు అని రుహైల్ ఆవేదనను వ్యక్తం చేశారు.
రోషన్ కుటుంబం తమ ప్రేమను అంగీకరించదని నాకు తెలుసు. ఆమె చుట్టూ భయంకరమైన నిర్బంధాన్ని విధించారు. మా రిలేషన్ బయటకు వచ్చాక ఆమెను విపరీతమైన కట్టడి చేస్తున్నారు అని రుహైల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











