Telephone Tapping టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో స్టార్ హీరోయిన్? భర్తతో విడాకులకు కారణం అదే అంటూ!

తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతున్నది. ఇతరులపై ఫోన్ కాల్స్‌పై ప్రభుత్వ అధికారులు నిఘా పెట్టిన వ్యవహారం పోలీసులు, ప్రభుత్వ అధికారుల మెడకు బిగుసుకొంటున్నది. గత ప్రభుత్వంలోని కీలక నేతలకు లింకు ఉందనే విషయంపై రాజకీయ, సినీ వర్గాల్లో దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రాజకీయ నేతల ఫోన్లపై నిఘా పెట్టినట్టు ప్రచారమైన విషయంలో తాజాగా స్టార్ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ స్టార్ హీరోయిన్ వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ కేసును సీరియస్‌గా తీసుకొన్నది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావును అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రిమాండ్‌లో ప్రణీత్ రావును విచారించగా పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టు సమాచారం. అయితే చాలా విషయాలను బయటకు రాకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది.

Is The Reason behind Star Heroine s divorce Telangana Government s Phone Tapping

ప్రణీత్ రావు బృందం జరిపిన ట్యాపింగ్ వ్యవహారంలో రకరకాల కథనాలు వెలవడుతున్నాయి. బిజినెస్, సినీ, రాజకీయ, సాఫ్ట్‌వేర్ వర్గాలకు సంబంధించిన ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. ప్రతీపక్ష పార్టీల నేతలతో టచ్ ఉన్న వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారనే కోణం మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దక్షిణాదిలో అగ్రతారగా పేరున్న హీరోయిన్‌ ఫోన్‌ కూడా గత ప్రభుత్వంలోని కీలక నేతలు ట్యాప్ చేశారు. దాంతో ఆమె వైవాహిక జీవితం కూడా విచ్చిన్నమైంది. ఈ ట్యాపింగ్ వ్యవహారమే ఆ హీరోయిన్ తన భర్తకు దూరమయ్యేలా చేసింది. వారిద్దరి విడాకులకు కారణం టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అని విషయం ఇప్పడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Is The Reason behind Star Heroine s divorce Telangana Government s Phone Tapping

టెలిఫోన్ ట్యాపింగ్‌కు గురైన సినీతార విషయానికి వస్తే.. మలయాళ, తమిళ భాషల్లోనే కాకుండా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫ్యామిలీకి సంబంధించిన హీరోను వివాహం చేసుకొన్నది. ఆ తర్వాత సుమారు దాంపత్య జీవితం చక్కగా గడిపిన తర్వాత ఆ ఇద్దరు విడాకులు తీసుకోవడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది.

టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు ఊపందుకొన్న నేపథ్యంలో సినీ తార పేరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఏం జరిగిందనే విషయం ఆసక్తికరంగా మారింది. నిజంగా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారా? ఎందుకు చేశారు? దాంతో వారి వైవాహిక జీవితం విచ్ఛిన్నం అయిందనే ప్రశ్నలు ఇప్పుడు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X