చైతూతో సమంత విడాకులకు అసలు కారణం ఇదా? సామ్ చెప్పిందిదే!
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నాగచైతన్య విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. 4 ఏళ్ల కింద ఈ స్టార్ కపుల్ డివోర్స్ ప్రకటించడం అభిమానులను ఎంతగా బాధించింది. టాలీవుడ్ లో ఆదర్శ దంపతులుగా ఉన్న వీరు ఒక్కసారిగా సెపరేట్ కాబోతున్నామని చెప్పడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే అసలు వారు ఎందుకు విడిపోతున్నారనే విషయాలను మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. కానీ రీసెంట్ గా సమంత మాట్లాడిన కొన్ని మాటలతో అసలు రీజన్ ఇదేనంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
సమంత నాగచైతన్యతో విడాకులు..
సమంత రూత్ ప్రభు నాగచైతన్య మొదటగా 'ఏ మాయ చేసావే' చిత్రం సెట్స్ లో కలిశారు. 2010లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది అప్పటి నుంచి సమంత నాగచైతన్య మధ్య ప్రేమ మొదలైంది. ఏకంగా 7 ఏళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇక 2017లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఒప్పించింది హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి జరిగింది. వీరి మ్యారేజ్ తర్వాత టాలీవుడ్ లవ్ బర్డ్స్ అంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయి. గుడ్ న్యూస్ చెబుతారని అనుకుంటే అభిమానులు జీర్ణించుకోలేని విషయాన్ని చెప్పారు. 2021లో డివోర్స్ ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు.

సమంత రూత్ ప్రభు అసలు రీజన్ చెప్పిందా?
సమంత రూత్ ప్రభు రీసెంట్ గా సోషల్ మీడియా వేదికన సక్సెస్ వెర్స్ అనే ఇన్ స్టా ఖాతాలో వైవాహిక వ్యవస్థ బలహీనం కావడంపై ఓ చర్చ జరిగింది. వివాహా బంధంలో భర్త తీవ్ర అనారోగ్యానికి గురైతే భార్యను వదిలిపెట్టి వెళ్తారని, కానీ భార్యలు అలా చేయరని చెప్పుకొచ్చింది. ఇది ఒక సర్వేలో వెల్లడైందని సామ్ వివరించింది. దీంతో ఇటీవల ఇది పెద్ద చర్చగా మారింది. సామ్ మాటలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తన జీవితంలో కూడా సమంత అదే సమస్యను ఎదుర్కొందా? అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
సమంత పరోక్షంగా చెప్పిందిదేనా?
విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు మయోసైటిస్ వ్యాధితో బాధపడింది. అయితే మయోసైటిస్ వ్యాధితో తీవ్రతగా తీవ్రంగా ఉంటే.. ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే వారి డివోర్స్ కూడా అదే కారణం అయ్యి ఉంటుందా? అని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ గా సమంత ఇదే విషయాన్ని ప్రస్తావించడం, మరోవైపు గతంలో ఏడాది పాటు వయో సైటిస్ వ్యాధితో బాధపడటం అన్నీ అదే కారణమని చెబుతున్నాయని కొందరు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా సమంత, నాగ చైతన్య విడిపోవడం మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయమేనని అంటున్నారు.
సమంత రెండో పెళ్లి వార్తలు..
సమంత, నాగ చైతన్య విడాకులు జరిగి 4 ఏళ్లు పూర్తైంయింది. అయితే వీరిద్దరూ గతేడాది వరకు సింగిల్ గానే ఉన్నారు. కానీ నాగచైతన్య మాత్రం శోభితా ధూళిపాళను డిసెంబర్ 2024లో వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి సమంత రెండో పెళ్లి ఎప్పుడంటూ చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో డీప్ రిలేషన్ షిప్ లో ఉందంటూ రూమర్లు పుట్టుకొస్తున్నాయి. దీనిపైనా ఇంకా సమంత అటు ఖండించలేదు.. ఇటు సమర్థించకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











