RC15: రామ్ చరణ్ మూవీని ఆపేసిన శంకర్.. దీని వెనుక అసలు కారణం ఇదే

మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతోన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే పలు భారీ విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంటున్నాడు. దీనికితోడు విజయాలు కూడా సొంతం అవుతుండడంతో చరణ్ మరింత జోష్‌తో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తోన్నాడు.

మెగా హీరో రామ్ చరణ్ ఇటీవలే RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో అతడు మరో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ మూవీతో అతడి క్రేజ్ జాతీయ స్థాయికి పెరిగిపోయింది. అయితే, ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన మరో చిత్రం 'ఆచార్య' మాత్రం భారీ డిజాస్టర్‌ అయిపోయింది. ఈ ఫలితాన్ని పట్టించుకోకుండా రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో చేస్తున్నాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. అప్పటి నుంచి అస్సలు బ్రేకులు లేకుండానే చిత్రీకరణను జరుపుతూ వచ్చారు.

Is This Reason for Ram Charan and S. Shankar Movie Shooting Stopped

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన 50 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక, త్వరలోనే ఈ సినిమా క్లైమాక్స్ పార్టును షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారని ఫిలిం నగర్ ఏరియాలో భారీ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. దీనితోపాటే ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అంతేకాదు, శంకర్ 'ఇండియన్ 2' మూవీని మళ్లీ మొదలు పెట్టబోతున్నాడు.

విశ్వ నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తోన్న 'ఇండియన్ 2' మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దీన్ని ఇప్పుడు పున: ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం శంకర్.. రామ్ చరణ్ సినిమాను పక్కన పెట్టాడని కూడా టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. శంకర్ ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లు ఆగిపోవడమే అని తెలుస్తోంది. ఇక్కడి నిర్మాతలు తీసుకున్న నిర్ణయం కారణంగానే 'ఇండియన్ 2' సినిమాను మొదలు పెట్టబోతున్నారట. అయితే, దీన్ని కేవలం రెండు వారాల పాటే చిత్రీకరణ జరపబోతున్నారని తెలిసింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఇక, ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X