Jani Master Case: ‘సుకుమార్ చెప్పిన కూడా.. ’: విచారణలో గుట్టు విప్పేసిన జానీ!

Jani Master Case: కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కేవలం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేయడంతో ఆయనపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. ఈ క్రమంలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసు కస్టడీకి తరలించారు. నాలుగు రోజుల కస్టడీలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇండస్ట్రీని షేక్ చేసే సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ డైరెక్టర్ పేరు, అలాగే ఒక ప్రముఖ హీరో పేరు కూడా పోలీసుల ముందు వెల్లడించినట్లు సమాచారం.

ఇండస్ట్రీలో జానీమాస్టర్ కేసు హాట్ టాపిక్ గా మారింది. తన దగ్గర పని చేసిన లేడి డ్యాన్స‌ర్‌ను లైంగికంగా వేధించడానే ఆరోపణలు రావడంతో కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. ఈ తరుణంలో ఆ లేడీ కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. '2018లో ఢీ షోలో తనకు జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు. 2019లో తనని తన గ్రూపులో జాయిన్ చేసుకున్నారు. 2020లో ముంబైకి కార్యక్రమం నిమిత్తం వెళ్తే.. అక్కడ హోటల్లో తనపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ లొకేషన్లో కూడా కార్వాన్ లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించేవాడు. అలాగే పలు అత్యాచార యత్నం చేశాడు. తనను మతం మార్చుకోమని పెళ్లి చేసుకుంటానని కూడా వేధించాడు.' అని ఫిర్యాదు లో పేర్కొంది.

Is Tollywood Director sukumar involvement in the Choreographer jani master issue

అంతే కాకుండా..' జానీ మాస్టర్ తో పాటు, ఆయన భార్య కూడా తనపైన దాడి చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా, బయటికి చెప్తే నీకు అవకాశాలు లేకుండా చేస్తాను సినిమా ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని జానీ బెదిరించాడు. ఆయన బెదిరించడంతోనే ఇన్నాళ్లపాటు నేను నోరు మెదపలేదు. ఇలాంటి వల్ల మరోసారి బెదిరింపులకు గురి చేయడంతో ఫిర్యాదు చేశాను' అని లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదుపులో తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో విచారణ నిమిత్తం ఆయన పోలీసు కస్టడికి తరలించిన విషయం తెలిసిందే. నాలుగు రోజులు పాటు పోలీసు క‌స్ట‌డీలో ఉన్న జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు విచారించారు.

ఈ క్రమంలో బాధితురాలు స్టేట్మెంట్ ముందు పెట్టుకుని విచారించారు. నాలుగు రోజులపాటు పోలీసులు చాలా ప్రశ్నలు సంధించారట. అయితే.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన జానీ మాస్టర్ మరికొన్ని ప్రశ్నలకు అయితే సమాధానాలు చెప్పారట. తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారనీ, ఆ అమ్మాయి కేసు పెట్టడం వెనుక ఇండస్ట్రీలోకి పెద్దలు కుట్ర చేశారని జానీ ఆరోపించినట్టు తెలుస్తోంది. ఢీ షోలో ఆ అమ్మాయి పరిచయం అయిన విషయం వాస్తవమే. కానీ, 2019లో తానే కావాలని తన గ్రూపులో జాయిన్ అయ్యింది. తన టాలెండ్ చూసిన అవకాశమిచ్చానని తెలిపారంట. 2020లో మైనర్ గా ఉన్నప్పుడు ముంబై లో అత్యాచారం చేసిన విషయం అవాస్తవమని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

తనతో అతిగా వ్యవహరించడంతో తనని దూరం పెట్టాననీ, ఈ క్రమంలో గొడవలు జరిగాయని, తనను ఎన్నో రోజులుగా ఆ అమ్మాయే వేధింపులకు గురించి చేసిందని తెలిపినట్టు సమాచారం. ఈ క్రమంలో పుష్ప షూటింగ్ జరిగే సమయంలో ఆ డైరెక్టర్ ఎదురే ఇద్దరు మధ్య గొడవ జరిగిందనీ, గొడవలు మరింత ముదరడంతో డైరెక్టర్ సుకుమార్ ఇద్దర్ని పిలిచి మాట్లాడారనీ, అమ్మాయికి సర్దే చెప్పే ప్రయత్నం కూడా చేశారనీ, అప్పటికి అమ్మాయి డైరెక్టర్ మాట వినలేదని, తన పద్దతి మార్చుకోలేదని చెప్పినట్టు సమాచారం. కావాలనే తనపై కొంతమంది కుట్ర చేసి, ఆ అమ్మాయి చేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని జానీ మాస్టర్ నార్సింగ్ పోలీసుల ఎదుట పలు విషయాలను వెల్లడించినట్టు తెలిపారు.

Is Tollywood Director sukumar involvement in the Choreographer jani master issue

ఇదిలాఉంటే.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన లైంగిక దాడి కేసులో చట్టం అత్యాచారం ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ కూడా విధించిన విషయం తెలిసిందే. పోలీసు క‌స్టడీ గ‌డువు శనివారంతో (నేటీతో) ముగియ‌డంతో జానీమాస్టర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. కస్టడీలో పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు జానీ మాస్టర్ దాటవేశారనీ, బాధితురాలే తనను వేధించిందని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జానీకి అక్టోబ‌ర్ 3 తేదీ వ‌ర‌కు జ్యూడిషియ‌ల్ రిమాండ్ విధించి, అతడ్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరీ ఆ ప్రముఖ డైరెక్టర్ ను పిలిచి ప్రశ్నిస్తారా? అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X