ఆమెతో జానీ మాస్టర్ 6 ఏళ్లకుపైగా రిలేషన్‌షిప్.. బ్రేకప్ వెనుక ఆ ఇద్దరు టాప్ డైరెక్టర్స్!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక దాడి కేసు నమోదైన తర్వాత ఈ వివాదం అనేక మలుపులు తిరుగుతున్నది. గత ఆరేళ్లకుపైగా కొనసాగుతున్న రిలేషన్‌షిప్‌లో ఏనాడు కంప్లైంట్ చేయని ఆయన అసిస్టెంట్ ఏకంగా రేప్ ఆరోపణలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ బ్రేకప్ వెనుక పెద్ద తతంగమే నడిచిందనే విషయం సినీ వర్గాల్లోను, ఫిలింనగర్‌లోను జోరుగా ప్రచారం అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
జానీ మాస్టర్ ఓ డ్యాన్స్ షోలో జడ్జీగా ఉన్న సమయంలో ప్రస్తుత బాధితురాలు అందులో పెర్ఫార్మ్ చేసింది. అప్పుడు ఆమె ప్రతిభను చూసి.. తన వద్ద అసిస్టెంట్‌గా చేయమని ఆఫర్ ఇచ్చారు. ప్రముఖ కోరియోగ్రాఫర్ స్వయంగా ఆఫర్ ఇవ్వడంతో వెంటనే ఒప్పేసుకొన్నది. ఆ తర్వాత ఆయన మార్గదర్శకత్వంలో నడిచింది.

జానీ మాస్టర్, తన అసిస్టెంట్ మధ్య రిలేషన్‌షిప్ ఆరేళ్లుగా సాగింది. జానీ మాస్టర్ ఇండియాలోనే టాప్ యాక్టర్లకు, భారీ చిత్రాల్లోని పాటలకు కొరియోగ్రఫి చేయడం మొదలు పెట్టి.. దేశంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా మారారు. ఆయనతోపాటు ఆరేళ్లుగా ప్రస్తుత బాధితురాలు ట్రావెల్ అయింది. అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు, రజనీకాంత్, విజయ్ సూపర్ స్టార్స్‌కు ఇద్దరు కలిసి పనిచేశారు.
అయితే ఆరేళ్ల కాలంలో వారి మధ్య గురుశిష్యుల కంటే మించి ఓ బంధం ఏర్పడింది. అలా వారిద్దరూ రిలేషన్‌షిప్ కొనసాగించారు. కానీ గతేడాది క్రితం వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. దాంతో గొడవలు మొదలు కావడంతో సినీ పెద్దల దృష్టికి వెళ్లింది. అయినా ఇద్దరి మధ్య గొడవలు తగ్గకపోవడంతో వివాదంగా మారింది.
జానీ మాస్టర్, తన అసిస్టెంట్‌కు మధ్య ఏర్పడిన వివాదం ఇండస్ట్రీలోని ఇద్దరు టాప్ డైరెక్టర్ల వద్దకు వెళ్లింది. ఆ ఇద్దరు డైరెక్టర్లు ఈ ఇద్దరిని కూర్చొబెట్టి నచ్చ జెప్పారు. ఒకరికొకరు సరిపడనప్పుడు విడిపోవడం మంచింది. ఇద్దరి కెరీర్లకు మంచి జరుగుతుంది అని నచ్చ జెప్పారు అని ఫిలింనగర్, సినీ వర్గాల్లో ఓ వార్త ప్రచారం జరుగుతున్నది.

అయితే ఇద్దరు టాప్ డైరెక్టర్ల సూచన, సలహాలతో జానీ మాస్టర్, తన అసిస్టెంట్ మధ్య బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత ఎవరికి వారు తమ ప్రోఫెషన్స్‌లో పనిచేసుకొంటున్నారు. కానీ అనూహ్యంగా ఇటీవల జానీ మాస్టర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆమె చెప్పడం అత్యంత వివాదంగా మారింది.
అయితే నిజంగా జానీ మాస్టర్ చేతిలో అన్యాయానికి గురైతే బాధితురాలికి న్యాయం జరగాల్సిందే అనే డిమాండ్ అందరి నుంచి వస్తున్నది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా జానీ మాస్టర్‌పై కేసు పడితే ఆయనకు న్యాయం జరగాలిందనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ముందు ఈ వివాదానికి ఎలా? ఎప్పుడు పుల్‌స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











