Kalki 2898 AD: కొత్త వివాదంలో కల్కి 2898, నిర్మాతలకు 100 కోట్ల టోకరా?

ఈ 2024 ఏడాది దాదాపుగా ముగింపుకి వచ్చేసింది. మరి ఈ ఇన్ని నెలల్లో మన తెలుగు సినిమా నుంచి అలాగే ఇండియన్ సినిమా దగ్గర కూడా భారీ హిట్స్ ఉన్నాయి పలు డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. కాగా ఇప్పుడు వరకు కూడా ఈ ఏడాదిలో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమా మాత్రం మన తెలుగు సినిమా పేరిటే ఉందని చెప్పాలి.

మరి ఆ సినిమానే పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా "కల్కి 2898 ఎడి" కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. మరి ఇండియన్ సినిమా నుంచి ఒక ప్రైడ్ కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని తాను పరిచయం చేయాలని చూసాడు. అయితే ఈ సినిమా ఏకంగా 1100 కోట్లకి పైగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ ని అందుకొని దుమ్ము లేపింది.

is top distribution house cheated kalki 2898 ad makers

కాగా దీనిని కొట్టే సినిమా ఇంకా ఈ ఏడాదిలో రాలేదు అయితే కల్కి సినిమా రిలీజ్ అయ్యాక మంచి టాక్ ని తెచ్చుకుని భారీ లాభాలు అందించిన సంగతి తెలిసిందే. ఒక్క తెలుగు, హిందీ లలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ లాభాలు కల్కి 2898 ఎడి అందించింది. మరి ఇలా భారీ లాభాలు అందుకున్న ఓ డిస్ట్రిన్యుషన్ సంస్థ అయితే మేకర్స్ కి లాభాలు ఇవ్వకుండా అసలు విషయం దాచారు అని ఓ షాకింగ్ న్యూస్ ఇపుడు చక్కర్లు కొడుతుంది.

కాగా యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వారు భారీ లెవెల్లో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారు. కాగా అక్కడ ఈ సినిమా ఊహించని విధంగా 18 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా నుంచి హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో టాప్ 3 లో ఒకటిగా నిలిచింది.

మరి 18 మిలియన్ కి పైగా అంటే ఒక్క అక్కడ నుంచే 150 కోట్లకి పైగా గ్రాస్ ని కల్కి అందుకుంది. మరి అక్కడ జరిగిన బిజినెస్ కి మించే చాలా లాభాలు కల్కి అందించినప్పటికీ అక్కడి డిస్ట్రిబ్యూటర్ మాత్రం తక్కు వైజయంతి మూవీస్ వారికి తక్కువ లెక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారట. దీనితో చిత్ర యూనిట్ వారికి రావాల్సిన మొత్తం ఇచ్చి తీరాలని స్ట్రాంగ్ గా చెప్పేశారట.

కేవలం 48 గంటలు సమయం ఇచ్చి తమకి రావాల్సిన వాటా తమకి ఇవ్వాలని తేల్చేశారట. అయితే ఇదే డిస్ట్రిబ్యూటర్స్ గతంలో ప్రభాస్ సలార్ ని కూడా రిలీజ్ చేశారు కానీ ఈ చిత్రం అక్కడ నష్టాలే మిగిల్చింది అని టాక్ వచ్చింది. కానీ కల్కి 2898 ఎడి మాత్రం డబుల్ ప్రాఫిట్స్ ని ఇచ్చినట్టు టాక్ మరి ఆ నష్టాలని ఇలా ఉంచుకోవాలని చూసారో ఏమో కానీ కల్కి మేకర్స్ ని చీట్ చేశారనే మాట మాత్రం ఇపుడు తెలుగు సినీ వర్గాల్లో వైరల్ గా వినిపిస్తుంది.

More from Filmibeat

Read more about: prabhas nag ashwin kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X