హ్యాండిచ్చిన అల్లు అర్జున్‌.. దిమ్మతిరిగే షాకిచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్!

తెలుగు సినిమా పరిశ్రమలోను, మీడియాలోను అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్ట్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తుందనుకొన్న మూవీ. ఆ సినిమా గురించి బన్నీ వాసు నుంచి ఐకాన్ స్టార్ వర్గీయులు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా ఉంటుందని చెప్పారు. కానీ ప్రస్తుతం అలాంటి ప్రాజెక్టు ఉంటుందని గట్టిగా చెప్పలేకపోవడమే కాకుండా ఆ విషయం గురించి మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్‌తో తీయాల్సిన సినిమాను త్రివిక్రమ్ క్యాన్సిల్ చేసి.. ఎన్టీఆర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే విషయం ట్రెండింగ్‌గా మారింది. ఈ వివాదం లాంటి కథ వెనుక అసలు వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఉంటుంది. స్క్రిప్టు దశలో ఉంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తాం. ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో టచ్ చేయని సబ్జెక్ట్. ఇప్పటి వరకు రాజమౌళి కూడా చేయని జోనర్. ఆ విజువల్స్, జోనర్‌ను ఎవరూ చూసి ఉండరు. సితార బ్యానర్‌లో యాంబిషన్ ప్రాజెక్టు అవుతుంది అని నాగవంశీ చెప్పారు. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ లెక్కలు మారిపోయాయి. ఆయన త్రివిక్రమ్ సినిమాను వదిలేసి.. అట్లీ సినిమాతో ముందుకు వెళ్లాడనే వార్త కొంత వివాదాస్పదంగా మారింది.

Trivikram Srinivas befitting reply to Allu Arjun

అయితే గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి డైరెక్టుగా సినిమా చేయకుండా త్రివిక్రమ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో పవన్ కల్యాణ్ నటించిన సినిమాకు, సితారలో నిర్మించిన సినిమాలకు కొంత సహాయం అందించారు. కానీ ఆయన దృష్టంతా అల్లు అర్జున్‌తో రూపొందించే మైథాలాజికల్ టచ్ ఉన్న కథపైనే ఉంది. అదే విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా ధృవీకరించారు.

అయితే తాను యాంబిషెస్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టును ఖాతరు చేయకుండా అల్లు అర్జున్ హ్యాండివ్వడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అట్లీ ప్రాజెక్టు ఫినిష్ అవ్వాలంటే.. కనీసం 2027 వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ కోసం అంతసేపు వెయిట్ చేసే సీన్ లేకపోయింది. దాంతో రెండు సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడనే విషయం మీడియాలో చర్చగా మారింది.

అయితే అల్లు అర్జున్ హ్యాండివ్వడంతో ప్రస్తుతం రాంచరణ్‌తో ఓ సినిమా, అలాగే ఎన్టీఆర్‌తో మరో సినిమాను మొదలుపెట్టాలని నిర్ణయించుకొన్నాడు. అల్లు అర్జున్ వదిలేసిన సినిమాను ఎన్టీఆర్‌తో చేసేందుకు ప్లాన్ చేశాడు. దీంతో ఐకాన్ స్టార్ చేసిన పనికి షాకిచ్చాడు అనే టాక్ సోషల్ మీడియాలో కొనసాగుతున్నది. అయితే షాకిచ్చాడా? లేదా? అనేది పక్కన పెడితే.. త్రివిక్రమ్‌కు మాత్రం అల్లు అర్జున్ చేయకూడని పని చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక హారిక హాసిని బ్యానర్‌లో రాంచరణ్ సినిమాను మొదలుపెడుతారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి సితారలో మూవీని స్టార్ట్ చేస్తారు. ఇందులో ఎన్టీఆర్ నటించే సినిమా పాన్ వరల్డ్ మూవీ. రాజమౌళి డోర్స్ ఓపెన్ చేశాడు కాబట్టి.. తర్వాత చేసే వారంతా కూడా ఆయన దారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా వరల్డ్ సినిమాకు కొత్తగా ఉంటుంది అని నాగవంశీ బల్లగుద్ది చెప్పడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X