ఎవరీ జితేందర్ రెడ్డి?.. టాలీవుడ్‌లో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో బయోపిక్!
తెలుగు సినిమా పరిశ్రమలో బయోపిక్స్ సినిమాలకు మంచి ఆదరణ పెరుగుతున్నది. మరుగున పడి ఉన్న ఉన్నత వ్యక్తుల జీవితాలను దర్శక, నిర్మాతలు వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తుల జీవితాలను సినీ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి కథతో వస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి చిత్రాలతో ఫీల్‌గుడ్ సినిమాలను అందించే దర్శకుడిగా విరించి వర్మకు పేరు ఉంది. కొంత గ్యాప్ తీసుకొని అలాగే తన టేకింగ్‌కు భిన్నంగా జానర్ మార్చి విరించి వర్మ తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే ప్రేక్షకులను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు.

జితేందర్ రెడ్డి సినిమా పోస్టర్ గురించిన వివరాల్లోకి వెళితే.. ఓ పసిపాపను పక్కన కూర్చొబెట్టుకొని ప్రజల కష్టాలు వింటున్న ఓ నాయకుడి పోస్టర్‌ను రివీల్ చేశారు. అయితే ఆ నాయకుడు ఎవరు? అనేది చెప్పకుండా క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. అంతేకాకుండా నటీనటులు ఎవరనే విషయం చెప్పకుండా ఆసక్తిని పెంచారు.
ఇక తాజా సమాచారం ప్రకారం.. జితేందర్ రెడ్డి సినిమా గురించిన వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా జితేందర్ రెడ్డి అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. భావోద్వేగంతో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తున్నది. బయోపిక్ లాంటి యాక్షన్ మూవీని విరించి వర్మ తీస్తుండటంతో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది.

జితేందర్ రెడ్డి సినిమాలోని నటీనటులను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వీఎస్ జ్ఞానశేఖర్, మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. నాగేంద్రకుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











