సంక్రాంతికి వస్తున్నాం బంపర్ హిట్ .. రెమ్యూనరేషన్ పెంచేసిన వెంకీ మామ
తెలుగు సినిమా ఆడియెన్స్ కి ఒక సినిమా నచ్చింది అంటే దానికి ఏ రేంజ్ లో బ్రహ్మరథం పడతారో గత ఐదేళ్ల సంక్రంతి బరిలో వచ్చిన సినిమాలే చూస్తే అర్ధం అవుతుంది. ఒక అల వైకుంఠపురం, సరిలేరు నీకెవ్వరు, క్రాక్, బంగార్రాజు, వాల్తేరు వీరయ్య, హను మాన్ లేటెస్ట్ గా అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కొట్టిన విజయాలే అని చెప్పవచ్చు.
తెలుగు సినిమాకి అతి పెద్ద సినిమా పండుగ సంక్రాంతి అయితే ఈ సంక్రాంతి బరిలో వచ్చిన ఎన్నో సినిమాలు రికార్డు రన్ తో సెన్సేషనల్ లాంగ్ రన్ ని చూసినవి ఉన్నాయి. ఇందులో ఇంట్రెస్టింగ్ గా మన సీనియర్ హీరోలు షైన్ అవ్వడం అనేది మరో ముఖ్య అంశం. కాగా మన సీనియర్ హీరోస్ లో భారీ స్టార్డం ఉన్నది మెగాస్టార్ చిరంజీవికి అని అందరికీ తెలుసు.

అయితే ఒక టైం లో చిరంజీవికి, బాలయ్య, వెంకటేష్ అలాగే నాగార్జునలు సమాన పోటీ చూసారు. కానీ కొన్నాళ్ళకి మిగతా ముగ్గురు మినహా మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ భారీ లెవెల్లో పెరిగింది కానీ మూవీ లవర్స్ మాత్రం అందరూ హీరోలు బాక్సాఫీస్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. కాగా చిరంజీవి తర్వాత నటసింహం బాలయ్య వరుస హిట్స్ తో అదరగొట్టారు.
ఇక వీరి తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది మాత్రం విక్టరీ వెంకటేష్ అని చెప్పవచ్చు. కాగా వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియెన్స్ లో తన సినిమా క్లిక్ అయితే ఎలా ఉంటుందో లేటెస్ట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రూవ్ చేసింది. అయితే ఈ సినిమా కంటే ముందు వెంకీ మామ మార్కెట్ ఒకింత చాలా తక్కువే ఉండేది.

కానీ ఇపుడు సంక్రాంతికి వస్తున్నాం వసూళ్లు చూస్తే మన సీనియర్ హీరోస్ లో ఆల్ టైం హైయెస్ట్ గా దూసుకెళ్తుంది. దీనితో ఫైనల్ గా సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన సక్సెస్ తో వెంకీ మామ తన రెమ్యూనరేషన్ ని కూడా పెంచినట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా సంక్రాంతికి వస్తున్నాం సిిమాకి తాను 8 నుంచి 10 కోట్ల పారితోషికం అందుకున్నట్టుగా టాక్. కాగా ఇపుడు సంక్రాంతికి వస్తున్నాం భారీ సక్సెస్ తో దీనిని 15 కోట్లకి పెంచినట్టుగా తెలుస్తుంది.
దీనితో ఈ సక్సెస్ ని వెంకీ మామ బాగానే క్యాష్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గానే వెంకీ మామ తన రెమ్యునరేషన్ పై చేసిన కామెంట్స్ కూడా మంచి ఆసక్తిగా మారాయి. నేను నా రెమ్యునరేషన్ వైట్ లోనే తీసుకుంటాను ిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు అంటూ చేసిన కామెంట్స్ కూడా మంచి చర్చకి దారి తీశాయి.
ఇక వెంకీ మామ సంగతి అటుంచితే బాలయ్య కూడా డాకు మహారాజ్ హిట్ తో తన రెమ్యునరేషన్ కూడా భారీ గానే పెంచినట్టుగా టాక్ ఉంది. ఇలా మొత్తానికి అయితే మళ్ళీ మన సీనియర్ హీరోస్ ఒకొక్కరిగా ఫామ్ లోకి రావడం అనేది మంచి అంశం అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











