Chary 111 యాక్షన్ హీరోగా వెన్నెల కిషోర్.. చారి 111 సినిమా కథ ఏమిటంటే?

కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన శైలిలో వినోదాన్ని పంచుతున్న వెన్నెల కిషోర్ హీరోగా అవతారం ఎత్తనున్నారు. గతంలో కామెడీ చిత్రం జఫ్ఫా చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన ఈ సారి పూర్తిస్థాయి హీరోగా మారారు. అయితే కామెడీతో కూడిన యాక్షన్ చిత్రం వెన్నెల కిషోర్ చేయడం ఆసక్తికరంగా మారింది. వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న చారి 111 సినిమా వివరాలు, విశేషాల్లోకి వెళితే..

బర్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం చారి 111. మళ్లీ మొదలైంది ఫేమ్, దర్శకుడు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీ శర్మ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేయగా సినీ అభిమానులు, సినీ వర్గాల నుంచి విశేషమైన స్పందన కనిపించింది.

Is Vennela Kishore success as Action Hero for Chary 111 movie?

ప్రశాంతంగా ఉండే నగరానికి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి మాజీ సైనిక అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ) నియమిస్తారు. అయితే ఈ కథలో కన్‌ఫ్యూజన్‌తో ఉండే గూడఛారి పాత్లో వెన్నెల కిషోర్ కనిపించాడు. ఈషా పాత్రలో సంయుక్త మీనన్‌ను పరిచయం చేశారు. మహీ పాత్రలో ప్రియా మాలిక్ కనిపించనున్నారనే విషయం టీజర్‌లో స్పష్టం చేశారు. అయితే ఈ కథలో విలన్ ఎవరు? నగరానికి ముప్పు తలపెట్టడం వెనుక కారణం ఏమిటి? ప్రశాంత నగరాన్ని ఎందుకు డిస్ట్రబ్ చేయాలనుకొన్నారనేది విషయాన్ని గొప్యంగా ఉంచారు.

చారి 111 యాక్షన్ కామెడీ చిత్రం. వెన్నెల కిషోర్ స్పై రోల్‌లో కనిపిస్తారు. ఓ నగరంలో జరిగే అనుమానాస్పద సంఘటనను ఛేదించే పాత్రలో నటించనున్నారు.
వెన్నెల కిషోర్ పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుంది. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా, వినోదభరితంగా సాగుతుంది అని దర్శకుడు టీజీ కీర్తి కుమార్ అన్నారు.

స్పై జానర్ సినిమాల్లో చారి 111 మూవీ చాలా సరికొత్తగా ఉంటుంది. వెన్నెల కిశోర్ ఫెర్ఫార్మెన్స్, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్. కథలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. అందులో విలన్ రోల్ ఒకటి. విలన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చిత్ర నిర్మాత అదితి సోనీ చెప్పారు.

నటీనటులు: వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులు
నిర్మాత: అదితి సోనీ
రచన, దర్శకత్వం: టీజీ కీర్తీ కుమార్
ఎడిటింగ్: రిచర్డ్ కెవిన్ ఎ
స్టంట్స్: కరుణాకర్
ప్రొడక్షన్ డిజైన్: అక్షత బీ హొసూరు
పీఆర్వో: పులగం చిన్నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాలు కొమిరి
సాహిత్యం: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
సినిమాటోగ్రఫి: కషిష్ గ్రోవర్
సంగీతం: సైమన్ కె కింగ్
నిర్మాణ సంస్థ: బర్కత్ స్టూడియోస్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X