రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లి... షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ డైరెక్టర్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. గతేడాది ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ వీరిద్దరూ ఎక్కడా రియాక్ట్ కాలేదు. కొందరు ఒకడుగు ముందుకేసి ఫిబ్రవరిలో విజయ్ - రష్మికలు పెళ్లి చేసుకోబోతున్నట్లు డేట్, టైం, పెళ్లి వేదికతో సహా చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా వీరిద్దరి వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. నిజంగానే విజయ్ - రష్మికలు పెళ్లి చేసుకోబోతున్నారా? పెళ్లి ఎప్పుడు? అనేది మాత్రం బయటకు రావడం లేదు. తాజాగా ఈ వ్యవహారంపై టాలీవుడ్ డైరెక్టర్ ఒకరు స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు తరుణ్ భాస్కర్. డిఫరెంట్ కాన్సెప్ట్, టేకింగ్‌తో టాలీవుడ్‌లో విలక్షణ దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అలాగే విజయ్ స్టార్ హీరో కావడానికి కూడా బాటలు వేశారు తరుణ్. పెళ్లిచూపులు తర్వాత ఈ నగరానికి ఏమైంది, పిట్టకథలు, కీడా కోలా వంటి డిఫరెంట్ మూవీస్‌తో తరుణ్ భాస్కర్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్స్ క్యూకట్టినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ తరుణ్ మాత్రం తొందరపడలేదు. ఇదే సమయంలో తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు బుల్లితెరపై హోస్ట్‌గానూ అలరించారు.

Is Vijay Deverakonda and Rashmika Mandanna Wedding Confirmed Tharun Bhascker s Viral Comment Sparks Buzz

ఇటీవల ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో హీరోగా నటించారు తరుణ్ భాస్కర్. ఈషా రెబ్బా ఇందులో హీరోయిన్. అయితే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోగా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. తాజాగా తరుణ్ భాస్కర్ నటిస్తోన్న మరో చిత్రం గాయపడ్డ సింహం. ఈ మూవీలో ఫరియా అబ్ధుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కాశ్యప్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్, క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్‌తో గాయపడ్డ సింహం మూవీ తెరకెక్కుతోంది.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు. మా ఫ్రెండ్‌కి అమెరికా వీసా చాలాసార్లు క్యాన్సిల్ అయ్యింది. ఎందుకు క్యాన్సిల్ అయ్యింది.. దీనికి కారణం ఏంటీ వాడి ఈ మెయిల్ అడ్రెస్. అలా చాలా అంశాలు అమెరికా వీసా క్యాన్సిల్ కావడానికి కారణం అవుతాయి.. అవన్నీ ఖచ్చితంగా నవ్వు తెప్పిస్తాయి. కశ్యప్ దగ్గర స్ట్రాంగ్ హ్యూమర్ ఉంది. కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా తీశాడు. వాడికి ఫాలోయింగ్ కూడా బాగా ఉంది అన్నారు తరుణ్.

మారేడ్‌పల్లిలో నిలబడి టీ తాగేవాడిని.. అలాంటిది మీరు ప్రశ్నలు అడిగే రేంజ్‌కు వచ్చానని మీడియాకు పంచ్ విసిరారు. ఎయిర్‌పోర్ట్‌లో షార్ట్ ఫిలిం షూట్ చేయాలని ట్రై చేస్తే నన్ను నో ఫ్లయింగ్ లిస్ట్‌లో పెట్టారు. ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి వచ్చింది. అదంతా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంది 2024లో దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నారు.. 2025 డెసిషన్స్ మీరు 2027లో చూస్తారు. ఇలాంటి కథ రావడమే ఒక యూనిక్ ఆపర్చ్యూనిటీ, చాలా మంది ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తుంటారు. దీనిని వదులుకోవద్దని 3 సినిమాలకు సైన్ చేశాను.. ఓం శాంతి శాంతి శాంతి, గాయపడ్డ సింహంతో పాటు మరో సినిమా కూడా చేస్తున్నాను అని తరుణ్ పేర్కొన్నారు.

ఇక ఇదే ఇంటరాక్షన్‌లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల పెళ్లి గురించి మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు. విజయ్ దేవరకొండ వివాహం అని తెలిసింది మీరు వెళ్తున్నారా అని సదరు విలేకరి ప్రశ్నించాడు. దానికి తరుణ్ భాస్కర్ స్పందిస్తూ.. నాకు ఆహ్వానం అందలేదు.. ఒకవేళ ఇన్విటేషన్ వస్తే మీకు ఖచ్చితంగా వాట్సాప్‌లో ఫార్వాడ్ చేస్తా.. ఇద్దరం కలిసి వెళ్దాం అని కౌంటర్ ఇచ్చారు తరుణ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితుడైన తరుణ్ భాస్కర్ వ్యాఖ్యలను బట్టి.. నిజంగా రష్మికతో విజయ్ వివాహం జరుగుతుందా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X