విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లికి ముహుర్తం.. కన్ఫమ్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా రెండు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. వీరి తొలి కాంబో 'గీతా గోవిందం' సూపర్ హిట్ అయ్యింది. పైగా వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. వెండితెరపై ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ అప్పటికీ ఇప్పటికీ ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 'డియర్ కాంమ్రేడ్'తో మరోసారి అలరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్ స్క్రీన్ పై లవర్స్ గా, భార్యభర్తలుగా ఆడియెన్స్ ను మెప్పించగలిగితే ఇంకా నిజజీవితంలోనూ వారు ఒక్కటవ్వాలనే అభిప్రాయానికి కూడా వస్తుంటారు కొందరు. అది సాధ్యమయ్యే పని కాదని తెలిసినా రూమర్లను స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి స్టోరీనే కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న మధ్య సాగుతోంది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కొంతకాలం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ రూమర్లను విజయ్ కానీ, రష్మిక మాత్రం గట్టిగా ఖండించకపోవడంతో నిజమనే వార్తలూ వస్తున్నాయి.

Is Vijay Deverakonda conditions to Rashmika Mandanna Tollywood Director Interesting Comments

దానికి తోడు విజయ్ దేవరకొండ కలిసి డిన్నర్లకు వెళ్తున్నట్టు, కలిసి టూర్స్, వెకేషన్ ను కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టు, అలాగే పండగలకు కూడా విజయ్ ఫ్యామిలీతోనే రష్మిక మందన్న ఉంటున్నట్టు ప్రచారమైతే జరుగుతూనే ఉంది. పలు సందర్భాల్లో మేమిద్దం మంచి స్నేహితులం మాత్రమేనని విజయ్, రష్మిక చెబుతున్నా.. నెటిజన్లు మాత్రం ఆధారాలతో వాళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక రీసెంట్ గానే రష్మిక కాలుకు గాయమైనా విజయ్ పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లపోవడంపైనా మండిపడ్డారు.

ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్ షిప్ పై ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రష్మిక మందన్న విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం విజయ్ డిసిషనే. రష్మిక మందన్న ప్రస్తుతం హిట్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. కానీ విజయ్ కాస్తా వెనకబడి ఉన్నాడు. దీంతో విజయ్ కెరీర్ మళ్లీ హైలోకి వచ్చాకా అప్పుడు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఇది నా అభిప్రాయం. విజయ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాక తాళి కట్టాలని నిర్ణయించుకొని ఉండుంటాడు. ఈమేరకు రష్మిక మందన్నతో కండిషన్ కుదుర్చుకొని ఉంటాడేమో.. అంటూ వ్యాఖ్యానించారు.

Is Vijay Deverakonda conditions to Rashmika Mandanna Tollywood Director Interesting Comments

ఇక విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న తమతమ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. రీసెంట్ గా 'ఛావా' చిత్రంతో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. అంతకు ముందు 'పుష్ప2'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్డమ్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలనే టీజర్ విడుదలై ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X