Game Changer: చరణ్ సినిమాపై వాంటెడ్ నెగిటివిటీ? ప్లానింగ్ ప్రకారమే కుట్ర చేయిస్తున్నారా?
ఖచ్చితంగా సినిమాలో టాప్ హీరోస్ లో వారి అభిమానుల్లో ముఖ్యంగా గట్టి పోటీతో కూడిన గొడవలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే ఇవి ఎలా మారాయి అంటే ఒక హీరో తాలూకా సినిమాని చంపెయ్యండి ఇతర హీరోల అభిమానులు కొందరు కొన్ని సందర్భాల్లో కొందరి హీరోలు కూడా ఇన్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారని ఒక టాక్ ఉంది. కాగా దీని ఫలితం నిజంగా బాగున్నా సినిమాలకి కూడా దారుణంగా నెగిటివ్ జరిగి రావాల్సి వసూళ్లు కూడా రావడం లేదు.
దీనితో కంటెంట్ ఉన్న సినిమాలు కూడా కొన్ని దారుణంగా ప్లాప్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాల్లో రీసెంట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన "దేవర" కి కూడా జరిగింది. కానీ మిక్స్డ్ టాక్ లో కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన RRR హీరో సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం "గేమ్ ఛేంజర్"కి మాత్రం ంతకు మించిన నెగిటివ్ జరుగుతుంది అని చెప్పక తప్పదు.

ఇంత నెగిటివ్ లో కూడా ఇండియా వైడ్ గా గట్టి ఓపెనింగ్స్ నే ఈ సినిమా అందుకున్నప్పటికీ గేమ్ ఛేంజర్ పై నెగిటివ్ ప్రచారం మాత్రం అలా కొనసాగుతూ వెళుతుంది. కాగా ఈ సినిమా కోసం జరుగుతున్న నెగిటివిటీ వెనుక వాంటెడ్ ప్లాన్ ఉంది అన్నట్టుగా మెగా అభిమానులు అంటున్నారు. మెయిన్ గా గేమ్ ఛేంజర్ విషయంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో దారుణంగా ెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు.
కాగా వాటిలో ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇంకా యూట్యూబ్ లో చాలా వరకు భారీ ఎత్తున నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారట. దీనితో ఇది ఒకింత ఆశ్చర్యంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక వీటికంటే పెద్ద ట్విస్ట్ అండ్ నిజంగానే టార్గెట్ చేశారు అనేదానికి కారణం సినిమా రిలీజ్ రోజునే ఫుల్ క్లారిటీ ఉన్న ప్రింట్ లీక్ అవ్వడం అనేది అని చెప్పవచ్చు.

సో ఇవన్నీ చూస్తుంటే గేమ్ ఛేంజర్ కి కావాలనే నెగిటివ్ ప్లాన్ చేశారు అనే మాటలో నిజం లేకపోలేదు అని చెప్పక తప్పదు. నిజానికి గేమ్ ఛేంజర్ పై అంత నెగిటివ్ తెస్తున్నంత దారుణంగా లేదని ఫ్యాన్స్ సహా న్యూట్రల్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ఈ అడ్డంకుల్ని దాటుకొని నిలబడాలి అంటే కొంచెం కష్టతరమే అని చెప్పక తప్పదు.
మరి ఈ గడ్డు కాలాన్ని గ్లోబల్ స్టార్ అధిగమిస్తాడో లేదో అనేది చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ అద్వానీ అలాగే అంజలి నటించగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. అలాగే నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











