69 కోట్లతో భార్యకు విడాకులు.. భారీ మొత్తంతో వదిలించుకుంటున్న క్రికెటర్
క్లాసికల్ డ్యానర్ గా కెరీర్ ను ప్రారంభించిన ధనశ్రీ.. కొరియోగ్రాఫర్ గా, య్యూటబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తన ఫ్యూషన్ డ్యాన్ తో ధనశ్రీ భారీ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంది. 2021లో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో 'వాతీ కమ్మింగ్' సాంగ్ కు ఈమెనే కొరియోగ్రఫీ కూడా అందించింది. ఆ సాంగ్ ఎంతలా హిట్ అయ్యిందో.. ముఖ్యంగా ధనశ్రీ కొరియోగ్రఫీ ఎంత సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. ఇలా కెరీర్ ను మాత్రం మంచిగా గాడీలోనే పెట్టుకుంది.
ఇదిలా ఉంటే.. ధనశ్రీ వివాహ బంధం మాత్రం సాఫీగా కొనసాగడం లేదు. ఇంటర్నేషనల్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ను ధనశ్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ప్రస్తుతం విడిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కొద్దిరోజులు వీరు డివోర్స్ తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. వాటికి బలం చేకూర్చేలా ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకోవడం ఖాయమంటూ వార్తలు ఊపందుకున్నాయి. వీటిపైనా కూడా ధనశ్రీ స్పందిస్తూ.... తమ సెపరేషన్ పైనా వార్తలు పుట్టించొద్దు అంటూ... ధనశ్రీ సుధీర్ఘమైన నోట్ ను కూడా ఆ మధ్యలో విడుదల చేసింది.

ఇక ధనశ్రీ వర్మ మరో కొరియోగ్రఫర్ తో రిలేషన్ లో ఉందనే ఆరోపణలతోనే యజ్వేంద్ర చాహాల్ విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా తీవ్ర స్థాయిలో విడాకులపై వార్తలు వస్తున్నా ఇరువురు నుంచి ఎలాంటి ఖండన లేదు. వీరి డివోర్స్ పక్కా అని తమ అభిమానులు, జనాలు ఫిక్స్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వీరి విడాకుల విషయంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ధనశ్రీకి విడాకులు ఇచ్చేందుకు యుజ్వేంద్ర చాహాల్ రూ.60 కోట్ల భరణం చెల్లిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి పెద్ద అమౌంట్ తోనే చాహాల్ ఆమెను వదిలించుకుంటున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యుజ్వేంద్ర చాహల్ భరణం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక పోస్ట్ పెట్టలేదు.
ఏదేమైనా ధనశ్రీకి అధిక మొత్తంలో భరణం చెల్లించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ధనశ్రీ ఆస్తుల విలువ రూ.24 కోట్లు అని అంటున్నారు. టిక్ టాక్, యూట్యూబ్, కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను ప్రారంభించిన ధనశ్రీ ఈ స్థాయికి చేరుకోవడం ఆశ్చర్యకరంగానే మారింది. యుజ్వేంద్ర చాహల్ కారణంగా మరింతగా వెనకేసిందనే పుకార్లు ఉన్నాయి. ఇక ధనశ్రీ, యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలోనే పరిచయం అయ్యారు. కొన్నాళ్లు ప్రేమాయణం తర్వాత 2020 ఆగస్టు 8న పెద్దల సమక్షంలో వీరు ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగు నెలలకే.. 2020, డిసెంబర్ 22న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక హర్యానాలోని గురుగ్రాంలోని ఓ ప్రైవేట్ హాట్ లో రహస్యంగా జరిగింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్యలో సడెన్ గా ఈ డివోర్స్ పుకార్లు పుట్టడం ఒకింత బాధాకరం. వీరిద్దరి డివోర్స్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే పుకార్లు మాత్రం పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











