twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇస్మార్ట్ శంకర్: ఫ్లైట్ మొత్తం బుక్ చేసిన పూరి.. వారణాసిలో భారీ యాక్షన్ సీక్వెన్స్!

    |

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మే 1 నుంచి ఆధ్యాత్మిక నగరం వారణాసిలో షూటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో కీలకంగా ఉండే కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    ‘iSmart Shankar’ Action Episode in Varanasi

    ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం వారణాసి వెళ్లేందుకు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ కోసం ఒక ఫ్లైట్ మొత్తాన్ని బుక్ చేశారట. ఫైట్ కొరియోగ్రాపర్ రియల్ సతీష్ మాస్టర్ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరుగబోతున్నట్లు తెలుస్తోంది. పూరి సినిమాల స్టైల్‌లో పవర్‌ఫుల్‌గా ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని టాక్.

    రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

    English summary
    The shooting ‘iSmart Shankar’ will resume in the holy city, Varanasi from tomorrow. Here, a high octane action episode will be canned. This fight episode comes at a crucial juncture in the film and so the director Puri Jagannadh is going to shoot it on a large canvas. For this, the makers booked a whole flight for the entire cast and crew. Real Satish master will choreograph this action episode in trademark Puri Jagannadh style.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X