For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామ్, పూరిజ‌గ‌న్నాథ్ ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది

|

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌. డబుల్ దిమాక్ హైద‌ర‌బాదీ అనేది ట్యాగ్ లైన్‌. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్సుగా నటించిన ఈ మూవీని శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. జూలై 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తి కాదా.. మూడు పాట‌ల చిత్రీక‌ర‌ణ బ్యాలెన్స్ ఉంది. హైద‌రాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్లో ఈ సాంగ్స్ చిత్రీకరించనున్నారు.

మే 15న రామ్ బర్త్ డే స్పెషల్‌గా టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో టీజర్ మొత్తం నింపేశారు. రామ్ గెటప్, లుక్ ఏక్‌దమ్ ఊరమాస్.. యాక్షన్ సీన్లు, టపోరి హిందీ లాంగ్వేజ్ టీజర్‌కు క్రేజీగా మారాయి. పక్కాగా యూత్‌ను ఆకర్షించే విధంగా టీజర్‌ను కట్ చేశారు.

‘Ismart Shankar’ Releasing on July 12th

హీరో రామ్ బాడీలాంగ్వేజ్‌కు తగినట్టుగా రాసిన డైలాగ్స్‌ సినిమాలో కేక పెట్టించే విధంగా ఉండబోతున్నాయి. నాతో కిరికిరి అంటే.. పోశమ్మ గుడి ముందు పొట్టేలు కట్టిసినట్టే అని రామ్ చెప్పిన డైలాగ్స్ టీజర్‌లో హైలెట్ అనిచెప్పవచ్చు. టీజర్‌లో సీన్లు చూస్తే పూరి మార్కు మేకింగ్, డైలాగ్స్‌తో హీరో రామ్ మాస్ ఎలిమెంట్స్‌తో ఇస్మార్ట్ శంకర్ కనిపించబోతున్నదని స్పష్టమైంది.

రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

English summary
Energetic Star Ram, director Puri Jagannadh’s ‘Ismart Shankar’ Release on July 12th. Puri Jagannadh and Charmme Kaur are producing ‘iSmart Shankar’ under Puri Jagannadh Touring Talkies banner and Puri Connects.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more