గోవాలో రొమాన్స్ చేస్తున్న హీరో రామ్, నభా నటేష్.. బర్త్ డే రోజున..
ఎనర్టిటిక్ స్టార్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ అండ్ రొమాంటిక్ చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రానికి డబుల్ ధిమాక్ హైదరాబాదీ ట్యాగ్‌లైన్. తాజాగా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకొన్నది. ఓ పక్క పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకొంటూనే మరో పక్క పాటలను షూట్ చేస్తున్నారు. గోవాలో రామ్, నభా నటేష్‌పై ఓ పాటను గోవాలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు భాను మాస్టర్ డ్యాన్స్ కోరియోగ్రఫి చేస్తున్నారు.
హీరో రామ్ జన్మదినం సందర్భంగా మే 15వ తేదీన ఇస్మార్ట్ శంకర్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. టీజర్ మాస్‌తోపాటు క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేలా ఉంటుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం గోవాలో రామ్, నభా నటేష్‌పై పాట చిత్రీకరణ సజావుగా జరుగుతున్నది అని పేర్కొన్నారు.

ఇస్మార్ట్ శంకర్ చిత్రం పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై దర్శకుడు పూరి, హీరోయిన్ ఛార్మి కౌర్ రూపొందిస్తున్నారు. మాస్, అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేం రాజు తోట సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.
నటీనటులు:
రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు
సాంకేతిక వర్గం:
ఫైట్స్: రియల్ సతీష్
సాహిత్యం: భాస్కరభట్ల
ఎడిటర్: జునైద్ సిద్ధికీ
ఆర్ట్: జానీ షేక్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
మ్యూజిక్: మణిశర్మ
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్
దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











