For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sonu Sood మీద ఐటీ ఫోకస్.. ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు.. అసలు ఏమైందంటే?

  |

  బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత సంవత్సరం లాక్ డౌన్ లో చిక్కుకున్న వలస కూలీలను ఇంటికి పంపారు. ఆ తరువాత కూడా, అతను నిరంతరం ప్రజలకు సహాయం చేస్తూనే ఉండడంతో ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పుడు సోను సూద్ గురించి షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి, ముంబై ఆదాయపు పన్ను శాఖ అతని ఆస్తికి సంబంధించిన సర్వే నిర్వహిస్తోందని అంటున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  కరోనా రియల్ హీరో

  కరోనా రియల్ హీరో

  కరోనా మహమ్మారి సమయంలో సోను సూద్ తన సామాజిక సేవకు చాలా ప్రసిద్ధి చెందారు. గత సంవత్సరం, లాక్ డౌన్ సమయంలో, సోను కార్మికులు మరియు విద్యార్థులను వారి ఇళ్లకు పంపి వారి పాలిట దేవుడు అయ్యాడు. ప్రైవేటు బస్సులు మరియు విమానాల ద్వారా, సోను చిక్కుకుపోయిన అందరినీ వారి స్వస్థలాలకు మరియు రాష్ట్రాలకు తీసుకెళ్లారు. సోను నుండి సహాయం కోరుకునే వ్యక్తులతో ట్విట్టర్ నిండిపోయింది.

  హెల్ప్‌లైన్‌ కూడా

  హెల్ప్‌లైన్‌ కూడా

  దీంతో సోను ప్రజలకు సహాయం చేయడానికి హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాడు. అప్పటి నుండి ప్రారంభమైన సహాయ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అవసరం ఉన్నవారు సోనూ మరియు అతని బృందాన్ని ట్విట్టర్ ద్వారా సంప్రదిస్తారు. ఇటీవల, ఢిల్లీ ప్రభుత్వం సోనూను మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ చర్చనీయాంశం అయింది. దీని కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో సోనూసూద్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కింద, సోను చదువు కోసం సన్నద్ధం కాని పిల్లలకు మార్గనిర్దేశం చేసి విద్యావంతులుగా మారడానికి ప్రేరేపించబడతారు.

  కేజ్రీవాల్‌తో భేటీ

  కేజ్రీవాల్‌తో భేటీ

  అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ తర్వాత సోనూ సూద్ రాజకీయాల్లో చేరే అవకాశం గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు కూడా. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని సోనూ సూద్ చెప్పారు. సోనూకు రాజకీయ పార్టీలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, అతను రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే అవకాశాల గురించి తరచుగా చర్చ జరుగుతోంది. అయితే, సోను దీనిని ఖండిస్తూ వచ్చాడు.

  ఆదాయపు పన్ను శాఖ దాడులు

  ఆదాయపు పన్ను శాఖ దాడులు

  అయితే అసలు విషయానికి వస్తే బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఐటీ బృందం ప్రస్తుతం సోను ముంబై కార్యాలయంలో ఉంది. నివేదికల ప్రకారం, ఐటి బృందాలు సోను సూద్ మరియు అతని కంపెనీలకు సంబంధించిన 6 చోట్ల అకౌంట్ పుస్తకంలో తేడాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చిన తర్వాత సర్వే నిర్వహించాయి. కొన్ని రోజుల క్రితం, ఢిల్లీ ప్రభుత్వం సోనూ సూద్‌ని పాఠశాల విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించించి. ఈ సమయంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంపై ఊహాగానాలు కూడా వచ్చాయి, అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో తన రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని సోను స్వయంగా చెప్పారు.

  బిజీ బిజీ

  బిజీ బిజీ


  సినిమాల విషయానికి వస్తే సోను ఇప్పుడు అక్షయ్ కుమార్ సరసన పృథ్వీరాజ్‌లో కనిపించనున్నాడు. డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాజ్‌పుత్ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ కథ, ఇందులో అక్షయ్ కుమార్ టైటిల్ రోల్‌లో నటించారు. మానుషి చిల్లర్ ఈ చిత్రంతో తొలిసారిగా నటిస్తోంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నారు.

  English summary
  as per sources IT Department Raids at 6 Places Linked To Actor Sonu Sood says Sources
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X