నేను మామూలు మనిషిని, రాజమౌళి ఏ గ్రహం నుంచి వచ్చారో తెలియు: నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సురవరం. ఇందులో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. 'తెలివిగలవారు ఎక్కడో అక్కడ దొరికిపోతారు' అంటూ ఇటీవల విడుదలైన ట్రైలర్లో నిఖిల్ చెప్పే డైలాగ్ హైలెట్ అయింది. అయితే తాను రియల్ లైఫ్‌లో ఎప్పుడూ దొరికిపోలేదు. దొరికిపోయేంత పెద్ద తప్పులేమీ చేయలేదని తెలిపాడు ఈ యంగ్ హీరో.

నేను ఒకప్పుడు కొన్ని చిలిపి పనులు చేశాను. ఇంట్లో తెలియకుండా బీర్లు తాగడం లాంటివి చేసేవాడిని. కానీ ఎదుటి వ్యక్తికి హాని చేసే పనులు ఎప్పుడూ చేయలేదు. అలాంటి ఇంటెన్షన్ తనకు ఎప్పుడూ ఉండదని తెలిపారు.

It is impossible for every film to be successful: Actor Nikhil

మరో ప్రశ్నకు స్పందిస్తూ... ''నా గత చిత్రం 'కిరాక్ పార్టీ' అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. ప్రతి సినిమా హిట్ అనేది మామూలు మనుషులకు సాధ్యం కాదు. రాజమౌళిగారు ఏ గ్రహం నుంచి వచ్చారో తెలియదు... అందుకే ఆయన అన్ని వరుస హిట్టు ఇవ్వగలుగుతున్నారు'' అంటూ నిఖిల్ చమత్కరించారు.

అర్జున్ సురవరం చిత్రాన్ని మే 1న విడుదల చేయాల్సి ఉండగా అవెంజర్స్ ప్రభావం ఉంటుందని వాయిదా వేశారు. మహర్షి చిత్రం విడుదలైన వారం తర్వాత మే 17న అర్జున్ సురవరం చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బి మ‌ధు సమర్పణలో ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X