మైత్రీ సంస్థలో 700 కోట్ల అక్రమ పెట్టుబడులు.. దర్శకుడికి హవాల డబ్బు.. విచారణకు హీరోలు?

తెలుగు చిత్ర పరిశ్రమలో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో స్థాపించిన బ్యానర్ శ్రీమంతుడు సినిమాతో చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన వంటి చిత్రాలతో మంచి సక్సెస్ సాధించారు మైత్రీ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి.

ఇదిలా ఉంటే ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు రైడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో షాకింగ్ విషయాలు వెల్లడైనట్లు సమాచారం.

IT Officer Reveals Suspicious Foreign Investments In Mythri Movie Makers

ఒకేసారి 2 హిట్స్: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ నిర్మాణ సంస్థ ఈ ఏడాది సంక్రాంతికి ఒకరోజు వ్యవధిలోనే మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, నటసింహం బాలకృష్ణతో వీర సింహా రెడ్డి సినిమాలను విడుదల చేసి మంచి విజయం సాధించింది.

భారీ బడ్జెట్ తో: ఇక 2021లో అల్లు అర్జున్ తో 'పుష్ప: ది రైజ్' (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బంపర్ హిట్ అందుకుంది మైత్రీ సంస్థ. ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' (Pushpa 2) చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు నవీన్, రవిశంకర్. ఈ చిత్రాన్ని సుమారుగా రూ. 400 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం.

IT Officer Reveals Suspicious Foreign Investments In Mythri Movie Makers

హిందీ దర్శకుడితో: పుష్ప 2 సినిమానే కాకుండా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఖుషీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సైతం సెట్స్ పై ఉన్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NTR31 లేదా NTR32 వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్ దర్శకుడు) దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.

ఏప్రిల్ 19 నుంచి: ఇదిలా ఉంటే ఏప్రిల్ 19 నుంచి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు సంబంధించిన ఆఫీసుల్లో, నిర్మాతలు, డైరెక్టర్ ఇంట్లో రైడ్స్ చేశారు. ఈ దాడుల్లో రూ. 700 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విదేశీ పెట్టుబడులు ముందుగా ముంబైకి చెందిన ఓ కంపెనీకి ట్రాన్స్ పర్ అయినట్లుగా ఐటీ ఆఫీసర్స్ కనుగొన్నారు.

IT Officer Reveals Suspicious Foreign Investments In Mythri Movie Makers

హవాలా ద్వారా: ఈ మొత్తమంతా తిరిగి ఏడు కంపెనీలకు బదిలీ చేశారని, ఈ విధంగానే మైత్రీ నిర్మాణ సంస్థకు భారీగా పెట్టుబడులు అందినట్లు ఐటీ అధికారులు తేల్చారు. అంతేకాకుండా బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ నిర్మించేందుకు అక్కడి స్టార్ డైరెక్టర్ కు హవాలా ద్వారా రూ. 150 కోట్లు అందజేశారని కూడా తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం తమ ప్రొడక్షన్ లో రూపొందుతున్న సీక్వెల్ మూవీలో నటిస్తున్న హీరోకు కూడా ఇదే పద్ధతిలో రెమ్యురనేషన్ ఇచ్చినట్లు సమాచారం.

విచారణకు హీరోలు: సీక్వెల్ మూవీ హీరోతోపాటు మరో ఇద్దరు అగ్ర హీరోలకు జరిపిన చెల్లింపుల్లోనూ లొసుగులు ఉన్నట్లుగా ఐటీ అధికారులు పసిగట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సదరు హీరోల అకౌంట్స్ పరిశీలిస్తున్నారని, విచారణ నిమిత్తం వారిని ముంబైకి పిలవచ్చని మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. మరి చూడాలి విచారణకు ఏ హీరోలు హాజరవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X