twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సురేష్ బాబుకు షాక్.. ఐటీ అధికారుల సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

    |

    తెలుగు సినీ పరిశ్రమలో సురేష్ ప్రొడక్షన్స్‌కు ఉన్న బ్రాండ్ వాల్యూ అందరికీ తెలిసిందే. శతాధిక చిత్రాలను నిర్మించిన రామానాయుడు ఎన్నో గొప్ప చిత్రాలను తెలుగు ప్రజలకు అందించగా.. ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు అదే దారిలో నడుస్తూ మంచి చిత్రాలను ఆడియన్స్‌కు అందిస్తున్నారు. ఏ ప్రాజెక్ట్‌నైనా సురేష్ బాబు ఓకే చెప్పాడంటే అది కచ్చితంగా విజయం సాధిస్తుందనేది కొందరి నమ్మకం. అలాంటి సురేష్ బాబు ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అయితే వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తూ వస్తోన్న సురేష్ బాబుకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు.

    ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుకు సంబంధించిన రామా నాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ ఈ రోజు ఉదయం నుంచి దాడులు మొదలుపెట్టింది. గత కొన్నేళ్లుగా రామానాయుడు స్టూడియో‌కు సంబంధించి సరైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సోదాల్లో సురేష్ బాబు కార్యాలయాల్లోని కొన్ని కీలక పత్రాలను హార్ట్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సురేష్ బాబు.. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా 'వెంకీ మామ' సినిమా తెరకెక్కిస్తున్నారు. దాంతో పాటు పలు సినిమాలను డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

    IT Raids On Suresh Babu Ramanaidu Studio And Suresh Production Office

    చిన్న సినిమాలను ఆదుకుంటూ.. ఈ మధ్య ఎన్నో గొప్ప చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు, వెంకట్ మహా తెరకెక్కించిన కేరాఫ్ కంచెరపాలెం, తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది లాంటి చిన్న చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

    English summary
    IT Raids On Suresh Babu Ramanaidu Studio And Suresh Production Office. From Wednesday Morning It Raids Going On. Some Documents Also Hand Overed From Suresh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X