Don't Miss!
- News చిన్న రాయితో కొడితే హత్యాయత్నం అవుతుందా?
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
టాలీవుడ్లో ఐటీ దాడులు.. హీరోలపై అధికారుల కన్ను.. అసలేం జరుగుతోందంటే..?
తెలుగు సినిమా ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో నేటి ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ జరుపుతున్న సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాత, అగ్ర హీరోల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేయడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా సినిమాలు నిర్మించిన ప్రొడక్షన్ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
వెంకటేశ్ నివాసంలో..
నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఆయన సోదరుడు ప్రముఖ హీరో ‘విక్టరీ' వెంకటేశ్ నివాసంలోనూ తనిఖీలు చేస్తున్నారు. పుప్పాలగూడ లోని డాలర్ హిల్స్‌లో ఉన్న వెంకటేశ్ నివాసంలో ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
నాని ఇళ్లు, కార్యాలయాల్లోనూ..
అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్, ఎంసీహెచ్ఆర్డీ సమీపంలోని హీరో నాని కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. హీరోల ఆడిటర్లను దగ్గర ఉంచుకుని అధికారులు ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నారు.
లెక్కల్లో అవకతవకలు..
సినిమాలకు సంబంధించిన నిర్మాణ వ్యయాలు వార్షిక ఆదాయాల్లో లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ సోదాలపై మీడియా హడావుడి చేయాల్సిన అవసరం లేదని, ఇవన్ని సాధారణంగా జరిగే తనిఖీలేనని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
చిన్న సినిమాలతో లాభాల పట్టిన సురేష్ ప్రొడక్షన్స్..
టాలీవుడ్లో తెరెకెక్కుతున్న చిన్న సినిమాలకు సురేష్ ప్రొడక్షన్స్ చేయూతనిస్తోంది. మంచి సినిమాలు ఎక్కడున్నా సురేష్ బాబు చేయందించి.. వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కేరాఫ్ కంచెరపాలెం లాంటి మంచి చిత్రాలతో పెద్ద విజయాలను సొంతం చేసుకుని లాభాలను ఆర్జిస్తోంది. అయితే ఈ కారణంగా లెక్కల్లో భారీగా తేడా వచ్చిందని అందుకే ఐటీ అధికారుల కన్ను ఇటు పడిందని టాక్.
Recommended Video
వరుస ప్రాజెక్ట్‌లతో నాని బిజీ..
ఓ వైపు హీరోగా దూసుకుపోతూనే మరోవైపు చిత్రాలను నిర్మించేస్తున్నాడు నాని. అ! చిత్రాన్ని నిర్మించి జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు. మరో చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. నాని ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్ట్‌లకు కూడా భారీగానే తీసుకుంటున్నాడని అయితే అవన్నీ లెక్కల్లో చూపించడం లేదనే అనుమానంతోనే నాని ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారని వినికిడి. ఏది ఏమైనా నేటి సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగుతాయని తెలుస్తోంది.