For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో ఐటీ దాడులు.. హీరోలపై అధికారుల కన్ను.. అసలేం జరుగుతోందంటే..?

    |

    తెలుగు సినిమా ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో నేటి ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ జరుపుతున్న సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాత, అగ్ర హీరోల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా సినిమాలు నిర్మించిన ప్రొడక్షన్‌ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

    వెంకటేశ్‌ నివాసంలో..

    వెంకటేశ్‌ నివాసంలో..

    నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఆయన సోదరుడు ప్రముఖ హీరో ‘విక్టరీ' వెంకటేశ్‌ నివాసంలోనూ తనిఖీలు చేస్తున్నారు. పుప్పాలగూడ లోని డాలర్ హిల్స్‌లో ఉన్న వెంకటేశ్‌ నివాసంలో ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

    నాని ఇళ్లు, కార్యాలయాల్లోనూ..

    నాని ఇళ్లు, కార్యాలయాల్లోనూ..

    అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎంసీహెచ్‌ఆర్‌డీ సమీపంలోని హీరో నాని కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. హీరోల ఆడిటర్లను దగ్గర ఉంచుకుని అధికారులు ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నారు.

    లెక్కల్లో అవకతవకలు..

    లెక్కల్లో అవకతవకలు..

    సినిమాలకు సంబంధించిన నిర్మాణ వ్యయాలు వార్షిక ఆదాయాల్లో లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ సోదాలపై మీడియా హడావుడి చేయాల్సిన అవసరం లేదని, ఇవన్ని సాధారణంగా జరిగే తనిఖీలేనని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

    చిన్న సినిమాలతో లాభాల పట్టిన సురేష్ ప్రొడక్షన్స్..

    చిన్న సినిమాలతో లాభాల పట్టిన సురేష్ ప్రొడక్షన్స్..

    టాలీవుడ్‌లో తెరెకెక్కుతున్న చిన్న సినిమాలకు సురేష్ ప్రొడక్షన్స్ చేయూతనిస్తోంది. మంచి సినిమాలు ఎక్కడున్నా సురేష్ బాబు చేయందించి.. వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కేరాఫ్ కంచెరపాలెం లాంటి మంచి చిత్రాలతో పెద్ద విజయాలను సొంతం చేసుకుని లాభాలను ఆర్జిస్తోంది. అయితే ఈ కారణంగా లెక్కల్లో భారీగా తేడా వచ్చిందని అందుకే ఐటీ అధికారుల కన్ను ఇటు పడిందని టాక్.

    #Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again
    వరుస ప్రాజెక్ట్‌లతో నాని బిజీ..

    వరుస ప్రాజెక్ట్‌లతో నాని బిజీ..

    ఓ వైపు హీరోగా దూసుకుపోతూనే మరోవైపు చిత్రాలను నిర్మించేస్తున్నాడు నాని. అ! చిత్రాన్ని నిర్మించి జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు. మరో చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. నాని ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్ట్‌లకు కూడా భారీగానే తీసుకుంటున్నాడని అయితే అవన్నీ లెక్కల్లో చూపించడం లేదనే అనుమానంతోనే నాని ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారని వినికిడి. ఏది ఏమైనా నేటి సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగుతాయని తెలుస్తోంది.

    English summary
    IT Raids On Suresh Babu Ramanaidu Studio And Suresh Production Office. And Also On Venkatsh And Nani. From Wednesday Morning IT Raids Going On. Buzz Is That Some Documents Also Hand Overed From Suresh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more