ఏషియన్ సినిమా కార్యాలయంపై ఐటీ దాడులు.. అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు తెరపైకి
టాలీవుడ్‌లో ఏషియన్ సినిమాకు ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో మెజార్టీ భాగం ఏషియాన్ సినిమాస్‌దే. సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ పంపిణీ రంగంలో సక్సెస్ అయి థియేటర్ల నిర్మాణంలోనూ విజయం సాధించారు.

నిర్మాతగా అవతారం..
ఇక సునీల్ నారంగ్ సినిమాను నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గానూ అవతారమెత్తారు. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రాన్ని ఏషియన్ సినిమాపై నిర్మిస్తున్నారు. దీంతో నిర్మాతగానూ సక్సెస్ అయ్యేందుకు రంగంలోకి దిగాడు.

సూపర్ స్టార్‌తో కలిసి ఏఎంబీ
ఏషియాలో ది మోస్ట్ లగ్జరీ మల్టీ ప్లెక్స్ అయిన ఏఎంబీని అత్యంత భారీ హంగులతో హైద్రాబాద్‌లో నిర్మించారు. అత్యాధునికి వసతులతో నిర్మించిన ఏఎంబీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ అధినేత సునీల్ నారంగ్‌లకు వాటా ఉంది.

గతంలో ఏఎంబీ.. ప్రస్తుతం ఏషియన్ సినిమాపై
గతంలో జీఎస్టీకి సంబంధించి ఏఎంబీ మాల్‌పై దాడులు జరగ్గా.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు థియేటర్ యాజమాన్యం అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏషియన్ సినిమాపై ఐటీ దాడులు జరిగాయి. ఈ మేరకు సునీల్ నారంగ్, నారాయణ దాస్ సన్నిహితుల ఇంట్లోనూ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు తెరమీదకు..
ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు తెరమీదకు వచ్చింది. సునీల్ నారంగ్ అల్లు అర్జున్‌తో కలిసి మరో భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











