రామ్ చరణ్ చిన్ననాటి జ్ఞాపకాలు, ఎన్నో ఏళ్ల తర్వాత, భావోద్వేగం.. (ఫోటోస్)

Recommended Video

Ram Charan Visits His Childhood School,The Lawrence School,Lovedale || Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. తాను చదువుకున్న పాఠశాలను సందర్శించిన ఆయన అప్పటి మెమొరీస్ తలుచుకుని భావోద్వేగానకి గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ పిక్స్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

అప్పట్లో చిరంజీవి ఫ్యామిలీ మద్రాసులో ఉన్నపుడు రామ్ చరణ్‌ను స్థానికంగా ఉండే లారెన్స్ లవ్ డేల్ స్కూల్లో చదివించారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ షిప్ట్ అవ్వడంతో మెగాస్టార్ ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చేసింది. దీంతో రామ్ చరణ్ కూడా ఆ స్కూలు వదలక తప్పలేదు.

మిస్టర్ సి... బ్యాక్ టు స్కూల్

మిస్టర్ సి... బ్యాక్ టు స్కూల్

మిస్టర్ సి.. బ్యాక్ టు స్కూల్ అంటూ చరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. చరణ్ ఆ స్కూలు ఆవరణలో తిరగాడుతూ అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న దృశ్యాన్ని పై ఫోటోలో చూడొచ్చు. రామ్ చరణ్‌కు మాత్రమే కాదు... ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి జ్ఞాపకాలు ఉంటాయి.

స్కూలు క్యాంటీన్లో రామ్

స్కూలు క్యాంటీన్లో రామ్

లారెన్స్ లవ్ డేల్ స్కూల్ క్యాంటీన్ రూములో కూర్చుని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న మెగా పవర్ స్టార్. తాను చదువుకున్న రోజులకు, ఇప్పటికీ అక్కడ పెద్దగా ఏమీ మారలేదని, అంతా అలాగే ఉందని చరణ్ ఫీలయ్యారట. ఆ రోజుల్లో స్నేహితులతో కలిసి గడిపిన క్షణాలను చరణ్ గుర్తు చేసుకున్నారు.

లారెన్స్ లవ్ డేల్ స్కూల్ డార్మిటరీ

లారెన్స్ లవ్ డేల్ స్కూల్ డార్మిటరీ

లారెన్స్ లవ్ డేల్ స్కూల్ డార్మిటరీని సందర్శించిన చరణ్ తాము ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లో ఎంత సందడిగా ఉండేదో గర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆడుతూ పాడుతూ గడిపిన క్షణాలను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. చరణ్ భార్య ఉపాసన ఈ ఫోటోలు మెగా అభిమానులతో పంచుకున్నారు.

స్కూల్ విద్యార్థులతో...

స్కూల్ విద్యార్థులతో...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాకతో స్కూల్ స్టూడెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చెర్రీతో కలిసి అందరూ గ్రూఫ్ ఫోటో దిగారు. రామ్ చరణ్ పదేళ్ల లోపు వయసున్నపుడే ఈ స్కూల్లో చదువుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని స్కూలుకు ఆయన షిప్ట్ అయ్యారు.

రామ్ చరణ్ మూవీస్

రామ్ చరణ్ మూవీస్

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో RRR అనే భారీ మల్టీ స్టారర్‌లో నటిస్తున్నారు. ఇందులో నటించడంతో పాటు తన సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై తన తండ్రి చిరంజీవి హీరోగా ‘సైరా నరసింహారెడ్డి' అనే చిత్రం నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X