నృత్యకారిణిగా శ్రుతీ హాసన్, కమల్ పేరు నిలబెట్టేనా!!!

ఈ మధ్య బొత్తిగా కనిపించడమే మానేసిన శ్రుతీ హాసన్, తన పాప్ బ్యాండ్ ఎడ్జ్ కోసమే సమయమంతా వెచ్చిస్తోంది. తన ఓన్ కంపోజింగ్ లో పాటలు పాడుతూ కాలక్షేపం చేస్తున్న శ్రుతి మళ్లీ సినిమాలతో బిజీగా మారుతోంది. ఇటీవలే మాస్ మహారాజా సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రుతి, ఇప్పుడు తమిళంలో విజయ్ సేతుపతికి జోడీగా నటించేందుకు సై అంటోంది.

అయితే, ఇదివరకటిలా కాకుండా, ఈ మధ్య అమ్మడు ఆచి తూచి మాత్రమే సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. రవితేజ క్రాక్ లో వైద్యురాలిగా నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళంలో మరింత ఛాలెంజింగ్ రోల్ లో కనిపించబోతోందట అమ్మడు. ఇందులో గ్రామీణ నృత్యకారిణిగా ఆడిపాడబోతోందట.

Its Laabam for Sruthi, as she is to set the dance floor on fire

ఎస్పీ జనన్నాథన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాభంలో శ్రుతి గ్రామీణ ప్రాంతానికి చెందిన నృత్యకారిణిగా కనపించబోతోందిట. విజయ్ సేతుపతి ఇందులో ఓ సంఘ సంస్కర్తగా నటిస్తున్నాడు. సినిమాలో రెండు పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

గతంలోనూ విజయ్ సేతుపతి, ఎస్పీ జనన్నాథన్ కలయికలో ఓ సినిమా వచ్చింది. పురంపోక్కు ఎంగిర పోదువుదమయ్ అనే సినిమాలో ఆర్యా, శ్యామ్ వంటి స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ రేసులో నిలబడలేకపోయింది. అయితే లాభం పై మాత్రం ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

మరోవైపు లాభం సినిమాలో తన పాత్ర కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టిన శ్రుతీ యోగా, ఇండోర్ ఎక్సర్ సైజ్ లతో బాడీని షేప్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కసరత్తులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు కనువిందు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X