‘అమర్ అక్బర్ ఆంటోనీ’... శ్రీను వైట్లలో కాన్ఫిడెన్స్ పెంచిన ‘సి’ రిపోర్ట్
రవితేజ, ఇలియానా హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' నవంబర్ 16న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ సభ్యులు 'యూ/ఎ' సర్టిఫికెట్ జారీ చేశారు. సెన్సార్ సభ్యుల నుంచి కూడా సినిమా విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో దర్శకుడు శ్రీను వైట్లలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు.
ఈ చిత్రంలో మాస్ మహరాజ.... అమర్, అక్బర్, ఆంటోనీ అనే మూడు పాత్రల్లో కనిపించబోతున్నారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా ఒక్కో పాత్ర ఒక్కో విధంగా ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
రవితేజ సినిమా అంటేనే ప్రేక్షకులు వినోదం ఆశిస్తారు. మాస్ మహరాజా మార్క్ కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ సమపాళ్లలో రంగరించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ సినిమా ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు.

'మైత్రి మూవీ మేకర్స్' లాంటి పెద్ద బేనర్ నుంచి వస్తున్న సినిమా కావడం కూడా ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచింది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన 'మైత్రి మూవీ మేకర్స్' మరోసారి హిట్ కొడతామనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.


Click it and Unblock the Notifications











