Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అమ్మాయి ముందే పబ్లిక్‌గా ప్యాంట్ విప్పి చూపించిన జేడీ చక్రవర్తి
అమ్మాయి ముందే పబ్లిక్‌గా ప్యాంట్ విప్పి సెన్సేషన్ క్రియేట్ చేశాడు జేడీ చక్రవర్తి. ఆ సమయంలో చక్రవర్తితో పాటు హీరో కార్తికేయ కూడా ఉన్నాడు. ఆయనకు కూడా ఉరుకున్నాడా..? అంటే లేదు! వెంటనే అతని షర్ట్ విప్పేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలేం జరిగింది? చక్రవర్తి, కార్తికేయ ఇలా ప్యాంట్, షర్ట్ ఎందుకు విప్పేశారు? ఆ వివరాలు చూద్దామా..
లిప్‌కిస్సులు చాలవన్నట్లు.. ప్రమోషన్స్ లోనూ
నేటి తరం తెలుగు సినిమాల్లో ఎంత ఓపెన్‌గా బాడీ విప్పి చూపుతున్నారో.. అలాగే ఎంత ఓపెన్‌గా లిప్‌కిస్సులు పెట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది చాలదన్నట్లు సినిమా ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తూ జేడీ చక్రవర్తి, కార్తికేయ తమ షర్ట్, ప్యాంట్ విప్పి సరికొత్తగా ట్రై చేశారు.
కాఫీ షాప్‌లో అందరి ముందే..
హిప్పీ మూవీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కాఫీ షాప్ లో చుట్టూ అమ్మాయిలు, అందరూ చూస్తుండగానే కార్తికేయ షర్ట్ విప్పగా.. ఆ వెంటనే జేడీ చక్రవర్తి తన ప్యాంట్ విప్పి షాకిచ్చాడు. పైగా ఈ వీడియోను తమ సినిమా ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో పెట్టేయడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.
ఇంతకీ హిప్పీ అంటే ఏంటి సార్ అనగానే
షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన హిప్పీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హేమంత్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు జేడీ చక్రవర్తి, హీరో కార్తికేయ. అయితే ఆ ఇంటర్వ్యూ ముగించుకుని బయటకు వస్తున్న కార్తీకేయ, జేడీ చక్రవర్తిలను 'సర్ సర్.. ఒక్క క్వశన్ అడగడం మరిచిపోయా.. ఇంతకీ హిప్పీ అంటే ఏంటి సార్? మాటల్లో వద్దు చేతల్లో చేసి చూపించండి అని హేమంత్ అడగడంతో.. ఒకరి ముఖం ఒకరు చూసుకున్న ఆ ఇద్దరూ షర్ట్, ప్యాంట్ విప్పి చూపిస్తూ ఇదే హిప్పీ అర్థం అని చెప్పారు.
కార్తీకేయ షర్ట్ విప్పగా.. జేడీ ఏకంగా ప్యాంట్ విప్పేశాడు
కార్తీకేయ ఒంటిపైన ఉన్న షర్ట్‌ని తీసేసి దిస్ ఈజ్ హిప్పీ అనగానే.. అందుకు రెట్టింపుగా జేడీ చక్రవర్తి వెంటనే తన ప్యాంట్ విప్పి అండర్ వేర్ లుక్‌తో దిస్ ఈజ్ హిప్పీ అనేశాడు. దీంతో యాంకర్‌తో పాటు ఆ కాఫీ షాప్‌లో కాఫీ తాగుతున్న అమ్మాయి సైతం షాక్ అవ్వడం కనిపించింది వీడియోలో చూడొచ్చు. ప్రమోషన్ ఏమో గానీ ఇదో వింతగా ఉంది చూపరులకు!
హిప్పీ మూవీ..
టీఎన్ క్రిష్ణ దర్శకత్వంలో హిప్పీ తెరకెక్కింది. కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించగా.. నివాస్ కె ప్రసన్న సంగీతం సమకూర్చారు. కళైపులి ఎస్.థాను ఈ చిత్రానికి నిర్మాత. జూన్ 6న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు రెడీ అయింది హిప్పీ మూవీ. ఇందులో కార్తికేయ ప్లే బాయ్ రోల్ పోషిస్తున్నాడు.