మొత్తానికి దిల్ రాజు డిజాస్టర్ సినిమా అక్కడ హిట్టయ్యింది
నిర్మాతకు ఒక కథ నచ్చితే ఎలాగైనా ఆ సినిమా తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు కూడా అంతే.. కథ నచ్చితే ఎవరు బాగా లేదన్నా ఆ కథను తెరపైకి తెచ్చే వరకు ఊరుకోరు. ఆయన ప్రొడక్షన్ లో హిట్టయిన చాలా సినిమాలు చాలా కథలు కొందరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసినవే.
అయితే గత ఏడాది పట్టుబట్టి ఒక తమిళ్ సినిమాను రీమేక్ చేసిన దిల్ రాజు ఊహించని డిజాస్టర్ అందుకున్నాడు. తమిళ్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన 96సినిమాను తెలుగులో సమంత, శర్వానంద్ లతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. జాను అనే టైటిల్ తో విడుదలైన ఆ సినిమాకు కథ ఒరిజినల్ దర్శకుడే డైరెక్షన్ చేశాడు. ఇక సినిమాను ఎంతో మంది చేయవద్దని చెప్పినప్పటికీ దిల్ రాజు వినకుండా మంచి బడ్జెట్ తో నిర్మించాడు.

కానీ జాను సినిమా విడుదలైన మొదటిరోజే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని భారీ నష్టాలను మిగిల్చింది. ఇక సినిమా బిగ్ స్క్రీన్ పై డిజాస్టర్ అయినప్పటికీ మినీ స్క్రీన్ పై మాత్రం మంచి రేటింగ్ ని అందుకుంది. ఏప్రిల్ 12న స్టార్ మాలో జాను ప్రీమియర్స్ కు మంచి రేటింగ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 9.6 టిఆర్పీ రావడంతో ఓ విధంగా దిల్ రాజు అంచనాలు ఇలాగైనా తప్పలేవని హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. తమిళ్ లో ఒరిజినల్ కథలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











