మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరి కూతురో తెలుసా?
Ghattamaneni Family: సినీ ఇండస్ట్రీ.. ప్రస్తుతం నటవారసుల రాక కోసం ఎదురుచూస్తుంది. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోల వారసులు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నందమూరి, అక్కినేని, మెగాస్టార్, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నటులు తరతరాలుగా తమ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో కొత్త తరం నుండి మరో పేరు చేరబోతుంది. అది కూడా సూపర్‌స్టార్ కృష్ణ ఘట్టమనేని కుటుంబం నుంచి, తొలిసారి ఒక హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇంతకీ ఈ స్టార్ కిడ్ ఎవరో?
సూపర్‌స్టార్ కృష్ణ గారి వారసత్వాన్ని ఆయన కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కొనసాగిస్తున్నారు. తన అద్భుత నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు దాదాపు ఇరువై ఐదేళ్లుగా టాలీవుడ్ ప్రేక్షకులను తన నటన, చరిష్మా, హ్యాండ్సమ్ లుక్స్‌తో అలరిస్తూ, ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిని దాటుకుని పాన్-వరల్డ్ స్థాయికి ఎగబాగుతున్నారు.

అలాగే.. మహేష్ బాబు కొడుకు, కుమార్తె కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పటికే గౌతమ్ ఘట్టమనేని పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. నటనపై ఇంట్రెస్ట్ తో ప్రస్తుతం ఫిల్మ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. సితార సోషల్ మీడియాలో స్టార్ అయ్యినప్పటికీ ఇప్పుడప్పుడే ఈ చిన్నది ఇండస్ట్రీలో అడుగుపెట్టే ఛాన్సే లేదు. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా చదువు మీదనే ఉంది. ఈ తరుణంలో ఇక ఇప్పుడు మరో ఘట్టమనేని వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.
ఎవరో కాదు. కృష్ణ ముద్దుల కూతురు మంజుల. ఆమె కుమార్తె జాన్వీ సైతం టాలీవుడ్ కు పరిచయం కానుంది. జాన్వీ చిన్నతనంలోనే తల్లి మంజులతో కలిసి నటించింది. మనసుకు నచ్చింది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన జాన్వీ ఆ తరువాత చదువుపై ఫోకస్ పెట్టింది. ఇక ఇప్పుడు మహేష్ మేనకోడలిగా టాలీవుడ్ కి పరిచయం కానుంది. అందంలో అచ్చు తల్లిని పోలి ఉన్న జాన్వీ.. నటనలో కచ్చితంగా మేనమామను గుర్తుచేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రస్తుతం ఘట్టమనేని జాన్వి లైఫ్ స్టైల్ కూడా వైరల్ గా మారింది. ఇంతకాలం ఈ అమ్మడు పబ్లిసిటీకి దూరంగా, తన సొంత దారిలో ముందుకు సాగుతోంది. ఈ ముద్దుగుమ్మకు డ్యాన్స్, పెయింటింగ్, ఫిట్‌నెస్, డ్రైవింగ్, గేమింగ్‌లపై ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిరోజు ఉదయం జిమ్‌తో మొదలై, రాత్రి పెయింటింగ్‌తో ముగుస్తుందట. తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది'చిత్రంలో చిన్నప్పుడే కెమెరా ముందు కనిపించిన జాన్వి, అప్పటినుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది.
ఇప్పుడు ప్రొఫెషనల్ యాక్టింగ్ వర్క్‌షాప్‌లు, డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూ తన తొలి సినిమా కోసం సిద్ధమవుతోందట. ఇప్పటికే పలు జాతీయ బ్రాండ్లు, దర్శకులు ఆమెను సంప్రదిస్తున్నారని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న కొద్ది ఫోటోలే ఇంటర్నెట్ లో వైరల్ మారుతున్నాయి. ఇండస్ట్రీకి మరో కొత్త హీరోయిన్ వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా డెబ్యూ ప్రకటించకముందే స్టార్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జాన్వి.. ఘట్టమనేని వారసత్వాన్ని కొనసాగించబోతున్నదా? అనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.మరి ఏ డైరెక్టర్ అమ్మడిని పరిచయం చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











