హైపర్ ఆది నన్ను ఫ్లర్ట్ చేశాడు.. ఇప్పుడు మా రిలేషన్ ఇదే

బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన రైటింగ్ స్కిల్స్, పంచులు, ప్రాసలతో టెలివిజన్ రంగంలో సునామీని సృష్టించారు. హైపర్ ఆది ఉంటే ఆ స్కిట్ హిట్ అనే దగ్గరి నుంచి హైపర్ ఆది ఉంటే ఆ షో రేటింగ్ కూడా దూసుకుపోతుంది అనే స్థాయికి చేరుకున్నారు. టాలెంట్ తో తెలుగు టెలివిజన్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం టెలివిజన్ షోస్ తో పాటు సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకుంటూ వస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో మరింతగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు.

హైపర్ ఆదికి 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కింది. ఈ వేదికన హైపర్ ఆదికి అదిరే అభి ద్వారా ఎంట్రీ దక్కింది. అలా వచ్చిన అవకాశాన్ని శ్రద్ధగా వినియోగించుకున్నాడు. కంటెస్టెంట్ నుంచి అనతి కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఆ తర్వాత రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ వంటి ఆర్టిస్టులతో కలిసి వందల కొద్ది కామెడీ స్కిట్లను పండించారు. బుల్లితెర ప్రేక్షకులను విభిన్న స్కిట్లతో అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు.

Jabardasth Actress Deepu Naidu Shocking Comments about Hyper Aadi

అయితే హైపర్ ఆది టీమ్ లో కనిపించేందుకు చాలా మంది నటీమణులు కూడా ప్రయత్నించారు. ఒక్క ఛాన్స్ కోసం ఎదరు చూశారు. ఈ క్రమంలోనే పలువరికి హైపర్ ఆది తన స్కిట్లలో అవకాశం కల్పించారు. దాంతో వారికి కూడా కాస్తా గుర్తింపు లభించేలా చేశారు హైపర్ ఆది. ఆ విధంగానే నటి దీపు నాయుడుకు హైపర్ ఆది తన స్కిట్లలో చేసే అవకాశం ఇచ్చాడు. అలాగే వీరిద్దరూ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ రియాలిటీ షోలోనూ మెరిశారు. అంతే కాకుండా పలు రీల్స్ తోనూ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో హైపర్ ఆది దీపు నాయుడు మధ్య డేటింగ్ అంటూ ఎప్పటి లాగే కాస్తా రూమర్లు కూడా వచ్చాయి. ఇక తాజాగా వాటిపై నటి దీపు నాయుడు స్పందించింది. లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకుంటూ వచ్చింది. హైపర్ ఆది తనను ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడని చెప్పింది. మొదట్లో తనకు పెద్దగా నచ్చకపోయేది కానీ, ఆ తర్వాత మంచి క్లోజ్ నెస్ పెరిగిందని చెప్పింది. అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అయ్యామని వివరించింది. ఎలాంటి రిలేషన్ షిప్ లేదని, కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. దీపు నాయుడు కేరాఫ్ గోదావరి అనే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో కాస్తా గుర్తింపు దక్కించుకుంది. చెన్నైకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో సందడి చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా పలు పాత్రలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. మరోవైపు హైపర్ ఆది శ్రీదేవీ డ్రామా కంపెనీలో కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తూ వెండితెరపై ఆకట్టుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోనూ కార్యకర్తగా యాక్టివ్ గా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X