2024లో నా జోలికి ఎవరైన వస్తే దూల తీర్చి.. బూతులతో రెచ్చిపోయిన అనసూయ!

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన వాళ్లలో యాంకర్ అనసూయ ఒకరు. ఇక ఈ షోతో ఫుల్ పాపులారిటినీ దక్కించుకుని... సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఇక బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి.. పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టింది ఈ బ్యూటీ. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన హేటర్స్ కోసం.. 2024 వస్తున్న వేళ మాస్ వార్నింగ్ ఇచ్చింది. తన జోలికి వస్తే... దూల తీర్చుతా అంటూ బూతులతో రెచ్చిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే....

ఒకప్పుడు జబర్దస్త్ షోలో యాంకర్ గా కనువిందు చేసిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ భామ కోసమే షో చూసే వారు కూడా ఉండే వారు. అయితే ఈ భామ బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి.. సినిమాలపై దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను, పర్సనల్ లైఫ్ విషయాలను పంచుకుంటుంది. రోజుకో ఫోటో షూట్ చేసి.. అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

Jabardasth Anasuya Bharadwaj Mass Warning To Haters As New Year 2024 Enter Video Goes Viral

ఇక ఈ క్రమంలోనే ఆమెపై ఎన్నో సార్లు ట్రోలింగ్ జరుగుతూ వచ్చింది. ఎంతగా ట్రోలింగ్ జరిగితే.. అంతగా రెచ్చిపోతుంది అనసూయ. జబర్దస్త్ యాంకర్ గా ఉన్నప్పుడు ఆమె దుస్తులపై విపరీతమైన విమర్శలు వచ్చినా... అందుకు తగ్గట్లుగానే కౌంటర్లు ఇచ్చింది. నా బట్టలు నా ఇష్టమంటూ చెప్పుకువచ్చింది. విమర్శించడానికి మీరెవరు అంటూ ఫైర్ అయింది. ఏకంగా విజయ్ దేవరకొండను గెలికి మరీ వివాదాల్లో ఇరుక్కుంది.

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమె మీద దాడి చేసినా... వారితో పోరాడింది. కేసులు కూడా పెట్టింది. ఖుషి మూవీ విడుదల సమయంలో కూడా ఆమె గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ పేరుకు ముందు The అని పెట్టడంపై సెటైర్స్ వేసింది. ఇక కొద్ది రోజులు ఈ వివాదం నడించింది. ఇక ఈ వివాదంపై ఓ సందర్భంలో కూడా స్పందించింది. తాను కావాలనే నేను విజయ్ దేవరకొండ మీద పోస్ట్స్ పెట్టినట్లు ఓపెన్ గా చెప్పుకువచ్చింది.

Jabardasth Anasuya Bharadwaj Mass Warning To Haters As New Year 2024 Enter Video Goes Viral

దానికి కారణం.. తనపై ఆయన డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయించినట్లు ఆరోపణలు చేసింది. అలా వివాదాలు, ట్రోలింగ్స్.. బాగానే ఎదుర్కోంది ఈ భామ. మరి కొన్ని గంటల్లో సంవత్సరం మారబోతుందనగా.. మరో పోస్టు చేసింది అనసూయ.. 2024లో అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో వార్నింగ్ ఇస్తూ అనసూయ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఇక ఆ వీడియోలో 2023 నా మాటలు, బిహేవియర్ వలన ఎవరైనా బాధపడి ఉంటే... మీకు మంచిగా అయ్యింది అంటూ ట్విస్ట్ ఇచ్చింది. 2024లో కూడా నేను ఇలానే ఉంటా. నా జోలికి వస్తే దూల తీర్చి, దూపం వేస్తా... అంటూ బూతులతో రెచ్చిపోయింది అనసూయ.

ప్రస్తుతం అనసూయ చేసిన ఈ రీల్ వైరల్ గా మారింది. ఇక వివాదలు పక్కన పెడితే... ఈ ఏడాది అనసూయకు బాగానే కలిసి వచ్చింది. పలు సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించింది. మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు, ప్రేమ విమానం చిత్రాల్లో ఆమె నటించి అలరించింది. ప్రస్తుతం ఇక వచ్చే ఏడాది పుష్ప 2లో లేడీ విలన్ గా నటించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X