ఎస్ఎస్ రాజమౌళికి రష్మీగౌతమ్ లవ్ ప్రపోజల్... జక్కన్న రియాక్షన్ ఏంటంటే?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరిగా కీర్తి పొందుతున్నారు. 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలతో జక్కన్న వరల్డ్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. తెలుగు సినిమా సత్తాను హాలీవుడ్ సర్కిల్స్ లోనూ చాటి చెప్పిన ఘనత ఆయనకే దక్కింది... ఇక యాంకర్ రష్మీ గౌతమ్ బుల్లితెరపై సందడి చేస్తూ ఆడియెన్స్ ను తన స్థాయిలో అలరిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు హీరోయిన్ గానూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం యాంకర్ గా, మరోవైపు నటిగా కేరీర్ ను సాఫీగా నడిపిస్తోంది.
అయితే.. వీరిద్దరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడం విశేషం. జక్కన్న, రష్మీగౌతమ్ కలిసి నటించిన ఓ షార్ట్ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుల్లితెర నటితో జక్కన్న పెర్పామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన సినిమాలకు జక్కన్న ఏ రేంజ్ లో ప్రమోషన్స్ ఇస్తారో తెలిసిందే. సినిమా రీచ్ కోసం ఎత్తుకు పైఎత్తు వేస్తూ ఆడియెన్స్ లో ఆసక్తిని కలిగిస్తుంటారు. సినిమా తీయడంలోనే కాకుండా.. తీసిన ప్రాజెక్ట్ ను ప్రమోట్ చేసుకోవడంలోనూ మన దర్శకధీరుడు దిట్ట అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తన మొదటి సినిమా 'స్టూడెంట్ నెంబర్ 1' నుంచి 'ఆర్ఆర్ఆర్' వరకు రాజమౌళి ఎక్కడా ఓటమిని చవి చూడలేదు. పైగా ఎంతో మంది నూతన దర్శకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. టాలీవుడ్ లోనే కాదు.. ఇండియాలోనే వందశాతం సక్సెస్ అయిన డైరెక్టర్ గానూ జక్కన్న రికార్డు క్రియేట్ చేశారు.

ప్రస్తుతం జక్కన్న ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్ట్ షూటింగ్ ను ప్రారంభించారు. ఆ మూవీతోనే బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో ఓ సినిమా కోసం రాజమౌళి - రష్మీగౌతమ్ కలిసి నటించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.... ఆ విషయానికొస్తే.. రష్మీ గౌతమ్ ప్రేమను పొందేందుకు రాజమౌళి కొన్నాళ్లుగా ఫాలో అవుతుంటాడు. ఆమె నంబర్ కు పదే పదే ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటాడు. ఆర్జేగా వర్క్ చేస్తున్న రష్మీ గౌతమ్ కు ఎస్ఎస్ రాజమౌళినే ఫోన్ చేస్తున్నాడన్న విషయం తెలియదు. దాంతో పెద్ద పట్టించుకోదు.
కొద్దిరోజులకు రాజమౌళి రష్మీని ఫాలోఅవుతూ వెళ్లి.. ఫోన్స్ చేస్తున్నది తానే అని చెప్పేస్తాడు. పక్కనే ఉన్న తన ఫ్రెండ్ కూడా ఇదే కన్ఫమ్స్ చేస్తుంది. అప్పటికే ఫాలో అవుతున్న రాజమౌళి రష్మీ గౌతమ్ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతాడు. ఎస్ఎస్ రాజమౌళి తనను ఫాలో అవుతున్నాడని, ఫోన్ కాల్స్ లో మాట్లాడుతున్నది అప్పుడు తెలుసుకున్నా రష్మీ ఆనందంలో మునిగి తేలుతుంది. రాజమౌళి కూడా నేనే అని చెప్పడంతో సంతోషంలో సిగ్గుమొగ్గలేస్తుంది. ఆ వెంటనే తలను ఓవైపు వంచి కళ్లు కొడుతూ లవ్ ను ప్రపోజ్ చేస్తుంది.అది అర్థం కాని జక్కన్న ఆమెతో కళ్లు మండుతున్నాయా.. అంటూ ఫన్నీ రియాక్షన్ ఇస్తాడు. దాని అర్థం 'ఐ లవ్ యూ' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది రష్మీ. ఈ కథలో మధ్యమధ్యలో రొమాంటిక్ సీన్లు ఆసక్తికరంగా ఉన్నాయి... అయితే జక్కన్న, రష్మీ గౌతమ్ తో తీసిన ఈ ప్రమోషనల్ వీడియో సినిమా రేంజ్ లో ఉండటం విశేషం. గతంలో తీసిన ఈ వీడియో ఇప్పుడు కనిపించడంతో అభిమానులు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











