వ్యభిచార గృహంలో జబర్దస్త్ కమెడియన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో!!
బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత ఫేమస్సో.. అందులో ఆర్టిస్ట్‌లు అంతే ఫేమస్. మరీ ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్స్‌లో చేసే ప్రతీ ఆర్టిస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. శాంతి స్వరూప్, దొరబాబు, రైజింగ్ రాజులతో కలిసి హైపర్ ఆది చేసే స్కిట్స్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. అతని స్కిట్స్ యూట్యూబ్‌లో దూసుకుపోతూ ఉంటాయి. తాజాగా హైపర్ ఆది టీమ్ మెంబర్ వ్యభిచార గృహంలో పట్టుబడి వార్తల్లో నిలిచాడు. ఓ కథెంటో ఓ సారి చూద్దాం.

పంచ్‌లతో హైపర్ ఆది..
తన టీమ్ సభ్యులపైనే పంచ్‌లు వేస్తూ అందర్నీ నవ్విస్తుంటాడు హైపర్ ఆది. తన టీమ్‌లోని రైజింగ్ రాజు, శాంతి స్వరూప్‌లపై వేసే పంచులు.. వాటి ద్వారా పుట్టే హాస్యానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. హైపర్ ఆది స్కిట్స్‌లో అందరి కంటే దొరబాబుపై వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేరే లెవెల్.

దొరబాబు కసి..
హైపర్ ఆది వేసే పంచుల్లో దొరబాబుపైనే సగం ఉంటే.. అందులో దాదాపు 90 శాతం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. యూట్యూబ్‌లో వీడియోలు, కసి, కామం, ఇలా ప్రతీ డైలాగ్ దొరబాబుపై బాగానే పేలేది. ఏ స్కిట్‌లో చూసిన దొరబాబు పాత్ర కూడా అదే విధంగా ఉంటుంది.

తాజాగా పరదేశీ..
హైపర్ ఆది స్కిట్‌లో కొత్తగా వచ్చి చేరాడు పరదేశీ. అయితే గుర్తింపు కోసం బాగానే ప్రయత్నిస్తున్న పరదేశీ.. రోజా కళ్లలో బాగానే పడ్డాడు. ప్రతీ స్కిట్‌లో అతడిపై ఏదో ఒక పంచ్ పడటం, అది బాగా హైలెట్ అవ్వడంతో పరదేశీ పేరు కూడా జనాల్లోకి వచ్చేసింది. అయితే తాజాగా చేసిన ఓ పని వల్ల మరింత ఫేమస్ అయ్యారు.
Recommended Video


వ్యభిచారం చేస్తూ...
వ్యభిచార గృహంలో దొరబాబు, పరదేశి పట్టుబడటం షాక్‌కు గురి చేస్తోంది. విశాఖలోని ఓ అపార్ట్ మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో వీరిద్దరు పట్టుబడ్డారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నలుగురు మహిళలు, మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.


Click it and Unblock the Notifications











