ప్రియుడినే పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ బ్యూటీ.. ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్

Jabardasth Pavitra Engagement: బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షోలో ఎప్పుడూ ముందు ఉండేది జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది జీవితాలు నిలబడ్డాయి. మట్టిలోని మాణిక్యాలను కూడా వెలికి తీసుకవచ్చి వారి టాలెంట్ ను ప్రూవ్ చేసిన ఈ షో ఆల్ టైమ్ ఫేవరెట్ గా కొనసాగుతోంది. ఈషోతోనే కెరియర్ ప్రారంభించిన ఎంతో మంది ఇప్పుడు సెలబ్రిటీలుగా మారారు. సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ ఇరగదీస్తున్నారు. అయితే ఈ షో ద్వారానే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న పవిత్ర గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ పవిత్రగా ఈమె బాగా తెలుసు.

చూసేందుకు నల్లగా, బొద్దుగా, పొట్టిగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించడంలో ముందుటుంది. ఓ వైపు జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు ఇతర కార్యక్రమాల్లో కూడా కనిపిసస్తుంది. అలాగే సినిమాల్లోనూ ఛాన్సులు కొట్టేస్తూ కెరియర్ లో ఎదుగుతోంది. ఎప్పుడూ వర్క్ లో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా పవిత్ర కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు.

Jabardasth Beauty Pavitra Engagement Photos Goes Viral

ఎందుకూ అంటారా... ఆమె పోస్ట్ చేసింది ఆమె ఒక్కదాని ఫొటోలే కాదు. తనకు కాబోయే భర్త ఫొటోలు కూడా. తాజాగా నిశ్చితార్థం చేసుకున్న ఈమె ఈ ఫొటోలను నెట్టింట పెట్టగా.. అవి కాస్తా వైరల్ గా మారాయి. తనను చాలా కాలంగా ప్రేమిస్తున్న సంతోష్ నే ఆమె పెళ్లి చేసుకోబోతుంది. చాలా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈమె.. సంతోష్ ప్రేమను అంగీకరించలేనని చెప్పంది. కానీ అతడు మాత్రం పవిత్ర కోసం పరితపించి పోయాడు. ఆమెను ఎలాగైనా సరే ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇంతకాలం ఆమె కోసం వేచి చూసి మరీ ఆమె మనసును గెలుచుకున్నాడు.

సరిగ్గా ఏడాదిగా సంతోష్ పవిత్ర ప్రేమ కోసం ఎదురు చూడగా... ఆయన కల నెరవేరింది. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకుండానే నేరుగా ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నారు. అయితే ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. పవిత్ర చాలా విషయాలను రాసుకొచ్చింది. ఈరోజు తన జీవితంలో చాలా స్పషల్ రోజు అని.. తన ప్రేమ కోసం ఎదురు చూస్తున్న సంతోష్ కు ఓకే చెప్పినట్లు వెల్లడించింది. అలాగే అతడిని పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పినట్లు స్పష్టం చేసింది. అనుకోకుండా తమ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, అతడు తన మీద చూపించిన ప్రేమ చాలా నచ్చిందని వివరించింది.

Jabardasth Beauty Pavitra Engagement Photos Goes Viral

తన కోసం,తన ప్రేమ కోసం ఏడాదిగా సంతోష్ ఎదురు చూస్తున్నాడని.. ఎట్టకేలకు ఆ ఎదురు చూపులు ముగిశాయని పవిత్ర చెప్పుకొచ్చింది. తన చివర శ్వాస వరకు సంతోష్ చేయి విడవనని ప్రామిస్ చేసింది. అలాగే జీవితంలో తాము చాలా సమస్యలను ఎదుర్కున్నామని, ఇప్పుడు జీవిత భాగస్వామిగా తన జీవితంలోకి అడుగు పెట్టినందుకు థాంక్స్ అని.. ఇకపై ఇద్దరం కలిసి నడుద్దాం అంటూ పవిత్ర రాసుకొచ్చింది. అలాగే తమ ప్రేమకు ఓకే చెప్పిన కుటుంబ సభ్యులకు కూడా థాంక్స్ చెప్పింది. పవిత్ర షేర్ చేసిన ఈ పోస్టుకు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వస్తున్నాయు. ఆల్ ద బెస్డ్, ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండండంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X