పంచాంగం చూసి కాదు పబ్‌లకు వెళ్తూ జాతకాలు.. వేణుస్వామి అసలు బాగోతం బయటపెట్టిన కమెడియన్!
ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ట్రోల్స్రూపంలో బాగానే తెలుసు. సెలబ్రిటీల జాతకాల పేరుతో షాకింగ్ కామెంట్స్ చేస్తూ నెట్టింట్లో పాపులారిటినీ సంపాదించుకున్నాడు. కొంతమంది ఇతడు చెప్పేవి నిజమని నమ్మితే.. మరికొంతమంది బడాయి మాటలు బాగానే మాట్లాడతాడని చెబుతుంటారు. అయితే పంచాంగం చూసి జాతకం చెప్పడానికి బదులుగా పబ్ కు వెళ్లి అలా చేస్తూ జాతకాలు చెబుతారని ఓ జబర్దస్త్ కమెడియన్ చెప్పుకొచ్చారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేసిన కిర్రాక్ ఆర్పీ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టేజీపై అనేక పంచులు వేస్తూ.. అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈయన పెళ్లి తర్వాత చేపల కూర తయారు చేసే షాపు పెట్టాడు. ఆ తర్వాత మూసేశాడు. అయితే ప్రస్తుతం అనేక వీడియోలు చేస్తూ తెగ రచ్చ చేస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు సపోర్టింగ్ గా మాట్లాడుతూ అనేక మందిపై షాకింగ్ కామెంట్లు చేశాడు. ఇదిలా ఉండగానే.. తాజాగా మరో వీడియో విడుదల చేశాడు. అందులో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి సెన్సేషనల్ కామెంట్లు చేశాడు.

ముఖ్యంగా వేణు స్వామి అనే వాడు పంచాంగం చూసి జాతకాలు చెప్పకుండా.. పబ్ లకు వెళ్లి జాతకాలు చెబుతాడని వివరించాడు. సెలబ్రిటీలు వెళ్లే పబ్బులకు వెళ్తూ.. వారి స్నేహితులు, వారికి క్లోజ్ గా ఉన్నవారితో కలిసి మాట్లాడుతూ మందు తాగుతాడని.. అలా ఎవరైనా హీరోహీరోయిన్ల గురించి చెప్పగానే.. బయటకు వచ్చి బొట్టు పెట్టుకుని, లుంగీ కట్టుకుని.. పెద్ద స్వామీజాలా మారిపోయి జాతకం చెబుతారని కిర్రాక్ ఆర్పీ ఎద్దేవా చేశాడు. అయితే నాగచైతన్య, సమంత విడిపోవడం గురించి అలా తెలుసుకునే ఆయన ముందుగా చెప్పారని అన్నాడు.
సమంత, నాగ చైతన్యలతో పాటు వారి క్లోజ్ ఫ్రెండ్స్ వెళ్లే పబ్ కు వెళ్లి.. వారి లైఫ్ గురించి మాట్లాడుకుంటుండగా చాటుగా విని బయటకు వచ్చి జాతకం చెప్పారని అన్నారు. ఎవరి జీవితం గురించి అయినా వారి బంధువులు, స్నేహితులకు తెలుస్తుందని ఎక్కడో మాటల సందర్భంలో వారి గురించి మాట్లాడుకుటుండగా.. దాని గురించి తెలుసుకుని జాతకాలు చెబుతూ డబ్బులు సంపాదించడం, పేరు పొందాలనుకోవడం చాలా తప్పని అన్నాడు.

అయితే వేణు స్వామి గురించి ఇదంతా తెలియని వాళ్లు, ఆయనను నమ్మే వాళ్లు అవే నిజాలు అనుకుని.. ఆయన చాలా బాగా జాతకం చెబుతారంటూ లక్షల్లో డబ్బులు ఖర్చు పెడతారని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కిర్రాక్ ఆర్పీ చేసిన ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓసారి యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న కిర్రాక్ ఆర్పీ వీడియోపై ఓ లుక్ వేయండి.


Click it and Unblock the Notifications











