జబర్దస్త్ కమెడియన్‌ను ఏడిపించిన అనసూయ!
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ నటించి,నిర్మించిన చిత్రం కేశవ చంద్ర రమావత్ (KCR). గ్రీన్ ట్రీ స్టూడియో బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా ద్వారా సీనియర్ నటి సత్యకృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు గరుడవేగ అంజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ వేడుకలో అనుసూయ భరద్వాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుక వివరాల్లోకి వెళితే..
కేసీఆర్ ట్రైలర్ విషయానికి వస్తే.. పూర్తిగా గ్రామీణ వాతావరణంతో ఫీల్‌గుడ్‌గా ప్రారంభమవుతుంది. కేశవం చంద్ర రమావత్, మరదలి మధ్య చిన్ననాటి స్నేహం.. ప్రేమగా మారడం లాంటి అంశాలు ఆకట్టుకొనేలా చేసింది. కేసీఆర్ స్పూర్తిగా తాన పేరును కేశవ చంద్ర రమావత్ అలియాస్ కేసీఆర్‌గా పెట్టుకొన్నాననే అంశం అందర్నీ కనెక్ట్ అయ్యేలా చేసింది. లంబాడీ తండా బ్యాక్ డ్రాప్‌తో రూపొందే ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ హైలెట్ అయిందనే చెప్పాలి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో కేశవ చంద్ర రమావత్ మూవీ కథను స్వయంగా రాకింగ్ రాకేష్ రాసి నిర్మించారు. ఈ సినిమాకు గరుడవేగ అంజీ దర్శకత్వం, సినిమాటోగ్రఫిని అందించారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి బలగం మధు ఎడిటింగ్ బాధ్యతలు అందించారు. ఈ చిత్రంలో జోర్దార్ సుజాత, తాగుబోతు రమేష్, లోహిత్ కుమార్, బలగం మైమ్ మధు, ఇతర జబర్దస్త్ కమెడియన్లు నటించారు.
కేసీఆర్ ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ.. రాకేష్ మూవీ ట్రైలర్ ఆవిష్కరణకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీకి మీడియా భారీగా రావడం ఆనందంగా ఉంది. నేను కూడా మీడియా నుంచి వచ్చాను. ఇప్పుడు మీ అందరిని చూసి ఎమోషనల్ అయ్యాను. ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు.

కేశవ చంద్ర రమావత్ సినిమా కథ చెబుతూ ఈ సినిమా మరో బలగం అవుతుందన్నాడు. అయితే బలగం గొప్ప సినిమా. ఈ సినిమా రిలీజ్ తర్వాత కేసీఆర్ మూవీ గురించి గొప్పగా మాట్లాడుకొనేలా ఉండాలని కోరుకొంటున్నాను. రాకింగ్ రాకేష్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. వాడిని వెరేయ్, అరేయ్ అనే చనువు ఉందని అంటుండగా.. వెంటనే రాకేష్ కంటతడి పెట్టుకొన్నాడు. దాంతో ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు.
నా జీవితంలో ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. రాకేష్ నాకు సోదరుడి లాంటి వాడు. వీడు నా పట్ల ప్రేమ చ ాలా ప్రేమను కురిపిస్తాడు. కానీ చూసే వాళ్లకు అతివినయంగా అనిపిస్తుంది. కానీ వాడిలో నిజాయితీ ఉందని అనసూయ అన్నారు. గ్రీన్ ట్రీ బ్యానర్ పేరు పెట్టుకొని ఈ మూవీని తీయడం వాళ్ల మంచితనం కనిపించింది అని అనసూయ అన్నారు.


Click it and Unblock the Notifications











