KCR హీరోగా మారిన జబర్దస్త్ కమెడియన్.. కేసీఆర్ కోసం.. మంత్రి మల్లారెడ్డితో చేతులు కలిపి.!

తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్లు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. గతంలో అలీ, వేణు మాధవ్, సునీల్ లాంటి వాళ్లు తమ కామెడీతో మెప్పించి హీరోగా అదృష్టం పరీక్షించుకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారి దారిలో ఎంతో మంది హీరోలుగా మారారు. అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షోలో భారీ క్రేజ్ సంపాదించుకొన్న రాకింగ్ రాకేష్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనేందుకు సిద్దమయ్యారు. KCR అనే సినిమా టైటిల్‌ను ఇటీవల రిలీజ్ చేసి మూవీపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. రాకింగ్ రాకేష్, కేసీఆర్ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్‌ కామెడీ షోతోపాటు సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తున్న రాకింగ్ రాకేష్ ప్రస్తుతం KCR (కేశవ చంద్ర రమావత్) అనే టైటిల్‌తో హీరోగా మారాడు.ఈ సినిమాను గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్, విభూది ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గరుడవేగ అంజీ దర్శకత్వం వహిస్తున్నారు.

 Jabardasth Comedian Rocking Rakesh turns as Hero for KCR Movie

KCR (కేశవ చంద్ర రమావత్) సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. తెలంగాణ మంత్రి సీ మల్లారెడ్డి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ కటౌట్‌తో టైటిల్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌పై బంజారా మహిళ, గొర్రె, ఓ రైతుతో పోస్టర్‌ను డిజైన్ చేయడంతో ఆకర్షణీయంగా కనిపించింది.

 Jabardasth Comedian Rocking Rakesh turns as Hero for KCR Movie

KCR (కేశవ చంద్ర రమావత్) చిత్రంలో సీఎం కేసీఆర్ సలహాదారుడు దేశపతి శ్రీనివాస్, రచయిత పెద్దింటి అశోక్ కీలక సన్నివేశాలను రాశారు. నవీన్ కలా, రాకింగ్ రాకేష్ పూర్తిస్థాయి స్క్రిప్టును రాశారు. ఈ సినిమాకు కుసుమ రాజ్‌కుమార్, ఉండ్రవెల్లి నాగరాజు మాటలు రాశారు.

KCR (కేశవ చంద్ర రమావత్) చిత్రంలో మరో విశేషం ఏమిటంటే.. ప్రముఖ నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య మీనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, జోర్దార్ సుజాత, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తుండగా, బలగం మధు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 Jabardasth Comedian Rocking Rakesh turns as Hero for KCR Movie

నటీనటులు: రాకింగ్ రాకేష్, అనన్య మీనన్, తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, జోర్దార్ సుజాత, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు
దర్శకత్వం, సినిమాటోగ్రఫి: గరుడవేగ అంజి
నిర్మాత: రాకింగ్ రాకేష్
బ్యానర్: గ్రీన్ టీ ప్రొడక్షన్స్, విభూది ఎంటర్‌టైన్‌మెంట్స్, గరుడవేగ మేకింగ్స్
మ్యూజిక్: చరణ్ అర్జున్
ఎడిటర్: బలగం మధు
పాటలు: కాసర్ల శ్యామ్, గోరేటి వెంకన్న, చరణ్ అర్జున్
ఆర్ట్: బత్తుల మహేష్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X