నేను పుట్టి పెరిగిన ప్రాంతం కష్టాల్లో ఉంది.. అందరూ ఆదుకోవాలి.. షకలక శంకర్!
షకలక శంకర్ జబర్దస్త్ తో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో కూడా కమెడియన్ గా మంచి అవకాశాలు అందుకున్నాడు. ఇటీవల శంభో శంకర చిత్రంలో హీరోగా కూడా నటించాడు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తుఫాన్ భాదితుల కోసం విరాళాలు అందజేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా తాను పుట్టి పెరిగిన ప్రాంతం అని శంకర్ తెలిపాడు. తుఫాన్ భాదితులని ఆదుకునేందుకు శంకర్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. జనసేన పార్టీ తరుపున శంకర్ తుఫాన్ భాదితుల పలు కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ సందర్భంగా శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. తమ జిల్లాకి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరాడు.

నేను శ్రీకాకుళం జిలా వాసిని. మా జిల్లాకు ఇప్పుడు సమస్య వచ్చింది. నన్ను ఇంతటివాడిని చేసిన జిల్లాని అందుకునేందుకు వచ్చా. అందరూ తమ జిల్లా కోసం ఎంతోకొంత సాయం అందించాలని శంకర్ మీడియా ముఖంగా కోరాడు.


Click it and Unblock the Notifications











