Anasuya Bharadwaj రేవంత్ రెడ్డి స్పీచ్‌పై అనసూయ హాట్ కామెంట్.. వైరల్‌గా వీడియో!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రాజకీయ నేతల ప్రసంగాలు, ప్రెస్ మీట్స్‌లో వారు చేస్తున్న కామెంట్లు వైరల్ కావడమే కాకుండా వాతవరణాన్ని వేడెక్కిస్తున్నాయి. పోటాపోటీగా జరుగుతున్న ప్రచారంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియోపై తెలుగు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏమిటి? అందుకు ప్రతిగా అనసూయ చేసిన కామెంట్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

టెలివిజన్ ఛానెల్స్ చేతిలో ఉన్నాయని లోఫర్ నా కొడుకులు అడ్డగోలుగా వేస్తే ఊరుకోం. పండబెట్టి తొక్కి పేగులు తీస్తాం. ఎవరో వచ్చి మైక్ మూతి ముందు పెడితే.. ప్రతీ ఒక్కరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాంటి లఫూట్ నా కొడుకులకు సమాధానం ఇవ్వలేను అని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వాడిన పదజాలం, చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఓ ఛానెల్‌ను ఉద్దేశించి చేసిన ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ స్పీచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాథ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది.
ఓ ప్రైవేట్ ఛానెల్‌ను పండబెట్టి తొక్కుతా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా.. ప్రత్యర్థి పార్టీల నేతలు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తూ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వీడియోను షేర్ చేసి అనసూయ కామెంట్ చేయడంతో మరింత క్రేజ్ పెరిగింది.

కాంగ్రెస్ అగ్ర నేత రేవంత్ రెడ్డి వీడియోపై అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. కొన్ని సందర్భాల్లో మూడ్ అలానే ఉంటుంది అని కామెంట్ చేసింది. అయితే ఆ ట్విట్‌పై నెటిజన్లు నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మీడియా వాళ్లకు ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చింది అంటూ నెటిజన్లు అంటున్నారు. బీఆర్ఎస్‌కు కాకుండా కాంగ్రెస్‌కు ఆమె సపోర్ట్ చేస్తుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలోని చాలా మంది యాంకర్లు, సినీ గాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సీఎం కేసీఆర్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. ఆ తర్వాత ఎలా ఉంది అంటూ.. అప్పుడెంట్లుండే.. ఇప్పుడెట్లుండే అంటూ వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రేడ్డి వీడియోపై అనసూయ సానుకూలంగా స్పందించడం చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











