జబర్ధస్త్ కమెడియన్ హీరోగా సినిమా ప్రారంభం.. అందుకే అతడిని తీసుకున్నారట

బుల్లితెరపై ప్రసారం అవుతోన్న షోలలో జబర్ధస్త్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు ఎనిమిదేళ్లుగా టెలివిజన్ రంగంలో ఈ షో హవాను చూపిస్తుండడమే దీనికి ప్రధానమైన కారణం. అంతేకాదు, ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చాలా తక్కువ సమయంలోనే తమలోని నైపుణ్యాలను బయట పెట్టి సక్సెస్ అయ్యారు. వారిలో చాలా మంది సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన వారిలో గెటప్ శ్రీను ఒకడు.

అద్భుతమైన టాలెంట్‌తో ఎంతో కాలంగా ఆకట్టుకుంటున్నాడు గెటప్ శ్రీను. మిమిక్రీ, యాక్టింగ్, కామెడీలతో పాటు అన్ని రకాల రసాలను పండించగల నైపుణ్యం అతడి సొంతం. అందుకే పెద్ద పెద్ద సినీ హీరోల సినిమాల్లో అతడు అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు హీరోగా 'రాజు యాద‌వ్‌' సినిమాను చేస్తున్నాడు. 'నీది నాది ఒకే క‌థ‌', 'విరాట‌ప‌ర్వం' చిత్రాల‌కు చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కృష్ణ‌మాచారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంకిత క‌ర‌త్ హీరోయిన్‌గా చేస్తోంది.

Jabardasth Fame Getup Srinu Raju Yadav Movie Launched

సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా శనివారం ప్రారంభం అయింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ఈ సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడారు. సహజ సిద్ధమైన నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోయగల సత్తా ఉన్న నటుడు కాబట్టే ఈ చిత్రానికి గెటప్ శ్రీనును తీసుకున్నట్లు వాళ్లు చెప్పారు. ఈ సినిమా కూడా ఎంతో నేచురల్‌గా సాగేలా రూపొందించబోతున్నట్లు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X