Raju Yadav Trailer: సర్‌ప్రైజింగ్‌గా రాజు యాదవ్ ట్రైలర్.. గెటప్ శ్రీను కుమ్మేశాడుగా!

టాలెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎలాంటి వారినైనా స్టార్లుగా మార్చేస్తుంటారు. అలా ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ఎంతో మంది తమదైన రీతిలో ప్రభావాన్ని చూపించి సత్తా చాటుతోన్నారు. అలా బుల్లితెరపై సెన్సేషన్ అయ్యాడు గెటప్ శ్రీను. జబర్ధస్త్ షో ద్వారా సెలెబ్రిటీ అయిపోయన అతడు.. సినిమాల్లోనూ సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే అతడు హీరోగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు గెటప్ శ్రీను లీడ్ రోల్‌లో 'రాజు యాదవ్' అనే సినిమాలో నటిస్తున్నాడు.

విలక్షణమైన నటనతో ఎంతో కాలంగా బుల్లితెరపై ఆకట్టుకుంటున్న గెటప్ శ్రీను హీరోగా మారి 'రాజు యాద‌వ్‌' సినిమాను చేస్తున్నాడు. 'నీది నాది ఒకే క‌థ‌', 'విరాట‌ప‌ర్వం' చిత్రాల‌కు చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కృష్ణ‌మాచారి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అంకిత క‌ర‌త్ హీరోయిన్‌గా చేస్తోంది. ఎప్పుడో ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ చేసింది.

Jabardasth Fame Getup Srinu Starrer Raju Yadav Movie Trailer Released

గెటప్ శ్రీను హీరోగా నటిస్తోన్న 'రాజు యాదవ్' మూవీ నుంచి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో క్రికెట్ ఆడుతుండగా పెదాలకు దెబ్బ తగిలి.. ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా హీరో ముఖం తయారవుతుంది. అలాంటి అతడి జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ఆ సమయంలో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం.. తర్వాత ఆమె వదిలేసి వెళ్లిపోవడం చూపించారు. ఆ సమయంలో హీరోకు తగిలిన పెయిన్‌ను బాగా హైలైట్ చేశారు.

మొత్తంగా 'రాజు యాదవ్' ట్రైలర్‌లో గెటప్ శ్రీను తనదైన నటనతో కుమ్మేశాడు. ముఖ్యంగా అతడు కామెడీని, ఎమోషన్స్‌ను పండించడంలో సఫలం అయ్యాడు. దీనికి బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ చక్కగా కుదిరాయి. ఇక, ఇందులో చివర్లో గెటప్ శ్రీను రిచ్ మ్యాన్‌గా కారులో నుంచి దిగి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. తద్వారా ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.

ఇదిలా ఉండగా.. జబర్ధస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న చిత్రమే 'రాజు యాదవ్'. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వరుణ్మయి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, సన్నీ, సంతోష్ తదితరులు కీలక పాత్రలను చేస్తోన్నారు. ఈ సినిమాను మే 17వ తేదీన విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X