twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి గారిలో కసి చూశాను, అందుకే అంత గట్టిగా కొట్టారు: గెటప్ శ్రీను

    |

    రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి నిర్మించిన చిత్రం ఇస్మార్ట్‌ శంకర్‌. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 18న విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. 9 రోజుల్లోనే రూ.63 కోట్ల గ్రాస్‌ను సాధించింది.

    'ఇస్మార్ట్ శంకర్' చిత్రాన్ని మాస్ హిట్ చేసిన తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్స్ చెప్పారు ఇందులో ఓ ముఖ్యమైనప పాత్రలో నటించిన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను. ఈ మూవీలో పూరిగారు, చార్మి గారు అవకాశం ఇవ్వడం వల్లే ఇలాంటి హిట్ చిత్రంలో నేనూ భాగం కాగలిగాను అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

    Jabardasth Getup Srinu about Ismart Shankar Movie Success

    మాస్ సినిమా వస్తే విజల్ష్ వేయాలి, అరవాలి, పాట వస్తే డాన్స్ చేయాలి... ఇస్మార్ట్ శంకర్ విషయంలో థియేటర్లో ప్రేక్షకులు అవన్నీ చేశారు. మాకు కావాల్సినంత ఆనందం ఇచ్చారు. ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి పూరి సర్‌లో ఒక కసి చూశాను. కొడితే మామూలుగా కొట్టకూడదు అనే కసి ఆయనలో కనిపించేది. ఆయన యాటిట్యూడ్ ఎప్పుడూ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఎవరైనా ఆయనకు అడిక్ట్ అయిపోతామని గెటప్ శ్రీను తెలిపారు. చార్మిగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రతీది ఆవిడే చూసుకున్నట్లు వెల్లడించారు.

    ఇక్కడ ఒక ఆటం బాంబ్ గురించి మాట్లాడాలి. అది ఎవరో కాదు హీరో రామ్ గారు. ఆయనకు ఎనర్జీ స్టార్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది దగ్గర ఉండి చూసినపుడు అర్థమైంది. పెద్ద పెద్ద టేక్స్ డాన్స్ అయినా, డైలాగ్ అయినా ఈజీగా చేస్తారు. ప్రతి చిన్న షాట్ కూడా పర్ఫెక్టుగా రావడానికి చాలా కష్టపడ్డారు. ఆయనలో అంత ఎనర్జీ ఉంది కాబట్టే సినిమా ఆ లెవల్లో ఉందని గెటప్ శ్రీను తెలిపారు.

    రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

    English summary
    Jabardasth Getup Srinu Thanked Everyone For Ismart Shankar Movie Success. iSmart Shankar written and directed by Puri Jagannadh, produced by Puri Jagannadh and Charmme Kaur with music composed by Mani Sharma. It stars Ram Pothineni, Nabha Natesh, Nidhhi Agerwal and Satyadev Kancharana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X