నాగబాబుని భయపెట్టిన హైపర్ ఆది.. రోజాకు గురి.. తట్టుకోలేక సాయం చేసిన అనసూయ
టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపిన షో జబర్దస్త్. నవ్వులే ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్. జడ్జ్ స్థానంలో రోజాఎం నాగబాబు.. యాంకర్ ప్లేస్‌లో అనసూయ, స్కిట్స్ వేసే కంటిస్టెంట్స్ ఇలా ఎవరికీ వారు ప్రత్యేకమే. అందుకే గత కొన్నేళ్లుగా బుల్లితెరపై నవ్వుల హరివిల్లులు కురిపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది జబర్దస్త్ షో. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హైపర్ ఆది మాటల తూటాలు పేలాయి. ఆ వివరాలు చూద్దామా..

ప్రోమో వీడియో.. నవ్వులే నవ్వులు
వారం వారం కనువిందు చేసే ఈ షో ప్రోమో వీడియోలు ఈ మధ్యకాలంలో బాగా ఆదరణ పొందుతున్నాయి. జబర్దస్త్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని షో జరగడానికి నాలుగైదు రోజుల ముందే ఆ వారం జరగబోయే షో తాలూకు క్లిప్స్ కట్ చేసి యూ ట్యూబ్‌లో పెట్టేస్తున్నారు మేకర్స్. దీంతో ఈ ప్రోమో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హైపర్ ఆది హల్చల్.
తాజాగా అక్టోబర్ 3వ తేదీన ప్రసారం కాబోయే షో తాలూకు ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో హైపర్ ఆది మాటల తూటాలు హైలైట్ అయ్యాయి.
రోజా, నాగబాబు, అనసూయ ఎవ్వరినీ వదలకుండా పంచులు మీద పంచులేస్తూ హల్చల్ చేసేశాడు హైపర్ ఆది. ఆయన వేస్తున్న పంచు డైలాగులకు అనసూయ నవ్వు ఆపుకోలేకపోయింది.

పవన్, చిరంజీవి కాదు వరుణ్ తేజ్
తన స్కిట్స్‌లో భాగంగా ఎప్పుడూ పవన్, చిరంజీవిలను ఇమిటేట్ చేసే హైపర్ ఆది.. ఈ సారి వరుణ్ తేజ్ గెటప్ వేసేశాడు. గద్దలకొండ ఆది అవతారమెత్తి గజ గజ వణికించేశాడు. చేతిలో గన్ను పట్టుకొని నాగబాబుని భయపెడుతూ, రోజాకు కూడా గురి పెట్టేశాడు హైపర్ ఆది. అంతేకాదు వాళ్ళిద్దరిపై పంచులు మీద పంచులేశాడు.
నాటీ నాగబాబు.. రోటీ రోజా
నాటీ నాగబాబు.. రోటీ రోజా అంటూ తనదైన పదజాలంతో ఓ పవర్ ఫుల్ పంచ్ వేశాడు హైపర్ ఆది. దీంతో నాగబాబు, రోజా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక తన స్కిట్స్‌లో ఓ రేంజ్ లో రెచ్చిపోతున్న హైపర్ ఆదికి అనసూయ సాయం అందించడం, ఆడవాళ్లపై హైపర్ ఆది పంచులు.. ఇలా అన్నీ ఈ ప్రోమోలో చూపించి వచ్చే ఎపిసోడ్ పై ఆత్రుత నెలకొల్పారు జబర్దస్త్ యూనిట్.


Click it and Unblock the Notifications











