‘పవన్ కళ్యాణ్ పేరు పలికితే చంపేస్తాం '.. హైపర్ ఆదికి బెదిరింపులు..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది (Hyper Aadi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పదునైన పంచ్ డైలాగ్స్, చురుకైన ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది, జబర్దస్త్ వేదిక నుంచి వెండితెర వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆది ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని తెలియని కోణాలను బయటపెట్టాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరు పలికితే చంపేస్తాం అంటూ హైపర్ ఆదికి బెదిరింపులు వస్తాయట. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హైపర్ ఆది, జబర్దస్త్ షో ద్వారా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట అదిరే అభి టీమ్‌లో సభ్యుడిగా చేరిన ఆది, తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో తక్కువ కాలంలోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. స్టేజ్‌పై అతని ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అతడిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆ ప్రతిభతోనే అనతి కాలంలో టీమ్ లీడర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెరపై కూడా వరుస అవకాశాలు అందుకుంటూ.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.

Jabardasth Hyper Aadi Reveals Death Threats for Supporting Pawan Kalyan in Viral Interview

ఇక.. హైపర్ ఆది పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. తాజాగా హైపర్ ఆది బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ ((Big Tv Kissik Talks) అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో ఆయన కాలేజ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ షాకింగ్ విషయం వెల్లడించాడు. తాను చదువుకునే రోజుల్లోనే పవన్ కళ్యాణ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించేవాడినని, ఆ కారణంగా తీవ్ర బెదిరింపులు ఎదుర్కొన్నానని చెప్పాడు.

'నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పలికితేనే కోపంగా చూసేవారు. ఒకసారి దాదాపు పది మంది సీనియర్లు నన్ను కాలేజ్ బిల్డింగ్ పైకి లాక్కెళ్లి, ఇంకోసారి పవన్ కళ్యాణ్ పేరు తీస్తే పై నుంచి తోసేస్తాం అంటూ బెదిరించారు' అని ఆది చెప్పిన మాటలు అందరినీ షాక్‌కు గురిచేశాయి.

రాజకీయాలు అంటేనే నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందని, అయినా తాను నమ్మిన వ్యక్తి కోసం నిలబడటంలో ఎప్పుడూ వెనుకాడలేదని హైపర్ ఆది స్పష్టం చేశాడు. 'నేను నమ్మిన నాయకుడు జనాభా లెక్కల్లో ఒకడు కాదు... లెక్కలేనంత జనాభాకు ఒకే ఒక్కడు' అంటూ పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే పవన్ కళ్యాణ్‌కు అభిమానిగా ఉన్న హైపర్ ఆది, ఇండస్ట్రీలో స్థిరపడిన తర్వాత కూడా అదే అభిమానాన్ని కొనసాగిస్తున్నాడు. సినిమాల పరంగా, రాజకీయాల పరంగా తన మద్దతును ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా తన తల్లిదండ్రుల గురించి, లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

ప్రస్తుతం హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షో ప్రోమో విడుదలైనప్పటి నుంచి ఆది చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించాడో తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X