చంద్రబాబే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రే : కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా సినీ, రాజకీయ , ఇతర రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి తరలివచ్చి .. చంద్రబాబు, పవన్‌లను ఆశీర్వదించి అభినందనలు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ ఈసారి ప్రభుత్వంలో భాగం కావడతంతో ఆయన ఏ శాఖను తీసుకుంటారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంశాఖ బాధ్యతలను పవన్ స్వీకరిస్తారని ప్రచారం జరిగింది. ఆయన అడగాలే కానీ ఏ శాఖనైనా ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర , సాంకేతిక శాఖలను తీసుకున్నారు. పవన్‌తో పాటు గెలిచిన నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ.. కందుల దుర్గేష్‌కు పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖలను చంద్రబాబు కేటాయించారు.

jabardasth kiraak rp made sensational comments on pawan kalyan and chief minister post

అయితే పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలన్నది ఎంతోమంది అభిమానుల కల . కేవలం డిప్యూటీ సీఎం , ఇతర శాఖలతో ఆయన సరిపెట్టడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కీలకమైన హోంశాఖను తీసుకోవచ్చు కదా అని సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తనకు కేటాయించిన శాఖలు.. తన మనస్తత్వానికి, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరిగా ఉన్నాయని పవన్ అభిమానులకు కాస్తంత ఉపశమనం కలిగించారు. అయినప్పటికీ కొందరికి మాత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం నచ్చడం లేదు అనే అభిప్రాయాలు నెటిజన్లు, అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి వారిలో జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ కూడా ఒకరు. ఎన్నికల్లో కూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు వైసీపీ నేతల విమర్శలకు ఘాటుగా బదులిచ్చేవారు ఆర్పీ. ముఖ్యంగా మాజీ మంత్రి రోజానైతే చెడుగుడు ఆడుకునేవారు. ఫలితాలు వెలువడిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మరి వైసీపీ నేతల వల్ల తాను పడ్డ ఇబ్బందులను వివరించారు. ఆ తర్వాత కూడా ఆయన ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కార్యకర్తల కాళ్ల మీద పడ్డా తప్పులేదన్నారు.

jabardasth kiraak rp made sensational comments on pawan kalyan and chief minister post

ఎన్నికలు ముగిసే వరకు ఒక్క చిన్న గొడవ లేకుండా పనిచేసి కూటమికి ఘన విజయం చేకూర్చారని ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం వెనుక పవన్ కళ్యాణ్ 100కు 100 శాతం నిలబడ్డారని , అందులో నో డౌట్. ఆయన వల్లే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు అయింది అంటూ కిరాక్ ఆర్పీ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్‌పై ప్రశంసల వర్సం కురిపిస్తూ.. చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణ్ కూడా సీఎమ్మేనని .. మా గుండెల్లో ఆయన కూడా ముఖ్యమంత్రేనని చెప్పారు. మీ ఆలోచనలు చంద్రబాబు నాయుడికి చెప్పాలని కిరాక్ ఆర్పీ సూచించారు. ప్రస్తుతం ఆర్పీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్‌లోని విపక్షనేతను చూసిన జనం.. ఇకపై ఆయనలోని పాలకుడిని కూడా చూడనున్నారు. జనసేనాని ఇదే పోరాటం, స్పూర్తిని కొనసాగిస్తే భవిష్యత్తులో సీఎం పదవిని దక్కించుకోవడం పెద్ద కష్టం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X